IIIT Basara 2025 – 10th Marks vs Seat:
తెలంగాణలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీ బాసరలో (IIIT Basara 2025) సీట్ రావాలి అంటే పదో తరగతిలో కేటగిరీల వారీగా ఎవరికి ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుందో గత సంవత్సరాలను ఆధారంగా చేసుకుని,ఎక్స్పెక్టెడ్ మార్కుల వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా మేము మీకు తెలియపరుస్తున్నాము. దాదాపు 50,000 మంది వరకు విద్యార్థులు త్రిబుల్ ఐటీ బాసర అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. జూలై 4, 2025న త్రిబుల్ ఐటీ బాసర 2025 ఫలితాలు విడుదల చేయనున్నారు. కావున ఇప్పుడు విద్యార్థులలో వారికి ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుందో తెలుసుకోవాలని అటువంటి ఒక ఆత్రుత ఉంటుంది కాబట్టి, ఈ ఆర్టికల్ లో ఉన్న పూర్తి సమాచారం చూసి తెలుసుకోండి.
2024లో వచ్చిన కటాఫ్ మార్కులు ఆధారంగా అంచనా?:
గత ఏడాది సమాచారం ప్రకారం, త్రిబుల్ ఐటీ బాసరలో అడ్మిషన్స్ పొందిన విద్యార్థుల యొక్క కట్ ఆఫ్ మార్కుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
IIIT బాసర 2025 ఫలితాలు విడుదల చేసే తేదీ: Official Date
| category | 10వ తరగతి మార్కులు (600 కు ) | పర్సంటేజ్ (10th) |
| జనరల్ (OC) | 570-590 | 95% పైగా |
| BC – A/B/C | 550-570 | 90%-95% |
| SC | 530-550 | 85%-90% |
| ST | 500-540 | 83%-88% |
| PH/NCC/Sports | 480-520 | 80% పైగా |
Note: ఇవి గత సంవత్సరానికి సంబంధించిన అంచనా కట్ ఆఫ్ మార్కులు. ప్రతి ఏడాది పోటీ మరియు అప్లికేషన్ల సంఖ్యపై ఆధారపడి కొంత మేరకు కట్ ఆఫ్ మార్క్స్ లో తేడా ఉంటుంది.
స్కూల్ విద్యార్థులకు 6000 అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. ఇలా అప్లై చేయండి
2025 లో సీట్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి?:
- మీరు OC క్యాటగిరీకి చెందిన విద్యార్థులైతే 570 కి పైగా మార్కులు రావాలి
- మీరు BC కేటగిరీకి చెందిన విద్యార్థులైతే 550 కి పైగా మార్కులు వస్తే ఎక్కువ అవకాశం ఉంటుంది
- SC/ST అభ్యర్థులకు 500 నుండి 540 మార్కుల మధ్యన వచ్చిన అవకాశం ఉంటుంది
- వికలాంగులు, NCC, స్పోర్ట్స్ కోట కలిగిన విద్యార్థులకు 480 నుండి 510 మార్కుల మధ్య వచ్చిన అవకాశం ఉంటుంది.
తల్లికి వందనం పథకం అభ్యంతరాల పరిశీలన పూర్తి – రెండవ జాబితా విడుదల : మీ పేరు చూడండి
విద్యార్థులు గమనించాల్సిన ముఖ్యాంశాలు:
- 2025 లో కూడా బాసర త్రిబుల్ ఐటీ అడ్మిషన్స్ కోసం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే సెలక్షన్ చేస్తారు.
- ఇంటర్ లాగా ఎంపీసీ, బైపీసీ కోర్సులు లేవు. ఇది ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్.
- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి చెందిన అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు.
ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ బాసరలో అడ్మిషన్స్ పొందాలంటే పదవ తరగతిలో ఎక్కువ మార్కులు రావడం తప్పనిసరి.మీకు 10వ తరగతిలో 600 మార్కులకు 550 పైన మార్కులకు వస్తే ఖచ్చితంగా సీటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నీకు వచ్చిన మార్పుల ఆధారంగా మీకు సీటు వస్తుందో లేదో మీరు అంచనా వేసుకోవచ్చు.
IIIT బాసర 2025 ఫలితాలు విడుదల తేదీ:
త్రిబుల్ ఐటీ బాసర 2025 ఫలితాలను జూలై 4వ తేదీన విడుదల చేయనున్నారు. బాసర త్రిబుల్ ఐటీ అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, ఆరోజున అధికారిక వెబ్సైట్ నుంచి మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
