AP పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకు ₹6,000/- అకౌంట్ లో జమ చేయనున్న ప్రభుత్వం: ఇలా Apply చెయ్యండి

AP School Students Travel Assistancs Scheme 2025:

ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ₹6,000/- రూపాయలు అకౌంట్ లో జమ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మరొక కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థి యొక్క స్కూలు ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్నట్లయితే ఆ విద్యార్థులకు ట్రావెల్ అసిస్టెంట్ కింద సంవత్సరానికి ₹6000 రూపాయలు విద్యార్థి యొక్క తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేసే విధంగా కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ తగ్గి పిల్లల యొక్క హాజరు శాతాన్ని పెంచే విధంగా అలాగే విద్యార్థుల యొక్క అడ్మిషన్స్ ని ప్రభుత్వ పాఠశాలలో పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో ప్రారంభించారు. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

ముఖ్యమైన అంశాలు:

Join WhatsApp group

  • పాఠశాలలకు వెళ్లే ప్రతి విద్యార్థికి పది నెలలకు గాను ₹6,000/- అకౌంట్లో జమ చేస్తారు.
  • అర్హతలు: విద్యార్థి యొక్క పాఠశాల దూరం ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు.
  • మొదటి దశలో : పది జిల్లాల్లో పైలెట్ ప్రోగ్రాం కింద ప్రారంభించి, సుమారు 600 పాఠశాలలు, 10,000 మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
  • డబ్బులు ఎలా చెల్లిస్తారు: విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఖాతాలకు డబ్బులు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయబడతాయి.

ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?:

  • పాఠశాలలో విద్యార్థుల యొక్క హాజరు పెంచడం, డ్రాప్ అవుట్ శాతాన్ని తగ్గించడం
  • తల్లిదండ్రులపై పడుతున్నారవాణాచార్జిల భారాన్ని తగ్గించడంతో విద్యార్హతల్లో మెరుగుదల వస్తుంది
  • ఈ పథకం “సమగ్ర శిక్ష అభియాన్” ఆధారంగా అమలవుతుంది.

అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా విడుదల : check

అమలు చేసే విధానం:

  • జూలై నెల 5న విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ఈ ప్రోగ్రాం పై తుది నిర్ణయం తీసుకొని అన్నారు.
  • విద్యార్థులను ఆటో లేదా పబ్లిక్ బస్సుల ద్వారా తరలించేందుకు స్పష్టత ఇవ్వనున్నారు.
  • విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్ కి డబ్బులను డైరెక్ట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా అసిస్టెంట్ చేయబడుతుంది.

ఇంటర్మీడియట్ షార్ట్ మార్క్స్ మెమోలను విడుదల చేశారు: డౌన్లోడ్ చేసుకోండి

అప్లికేషన్ ప్రాసెస్ ఎలా?:

కొత్తగా విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

  • ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యానికి దరఖాస్తు చేసుకోవడానికి buspassonline.apsrtconline.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 12 ఏళ్లలోపు ఒక విద్యార్థులకు , 15 ఏళ్లలోపు బాలికలకు బస్సు పాస్ ఉచితం
  • 20 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించే విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
  • బస్సు పాస్ పొందడానికి క్రింది సర్టిఫికెట్స్ కావాలి:
  • స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్
  • విద్యార్థి యొక్క ఆధార్ కార్డు
  • విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
  • విద్యార్థి ఒక డేటా స్కూల్ హెడ్మాస్టర్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.

ముఖ్య గమనిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్కూల్ ట్రావెల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే. ప్రస్తుతానికి పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లోని ఇది అమలు చేస్తున్నారు. త్వరలో అన్ని జిల్లాల్లో ఈ ప్రోగ్రాం ని ప్రారంభించడం జరుగుతుంది.