AP EAMCET 2025 Exam 2025:
ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్ష రాసిన విద్యార్థులకుముఖ్యమైన అప్డేట్ వచ్చింది. పరీక్ష రాసిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఇంటర్ మార్కులు వెబ్సైట్లోనే డిక్లరేషన్ ఫారంలో లాగిన్ అయ్యి, మీరు గతంలో సబ్మిట్ చేసిన ఇంటర్ మార్కులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని, మార్కులను సరి చేసుకోవాలని ఇంటర్ బోర్డు కన్వీనర్ తెలిపారు. ఇంటర్ మార్కులు సరిగ్గా లేని పక్షంలో, ఆ విద్యార్థులకు ఎంసెట్లో 25% వెయిటేజ్ మార్కులు కలపడానికి ఇబ్బందులు తలెత్తుతాయని బోర్డు తెలిపింది. కావున ఎంసెట్ పరీక్ష రాసిన ప్రతి ఒక్క ఇంటర్ విద్యార్థి వారి యొక్క మార్కులను డిక్లరేషన్ ఫారం లో సరిచూసుకోవాలి. ఇలా ఎడిట్ చేసుకోవడానికి జూన్ 5వ తేదీ వరకు సమయం అయితే ఇచ్చారు. వీటిని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలనే పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఏపీ ఇంటర్ మార్క్స్ అప్డేట్ డిక్లరేషన్ ఫారంలో Edit ఎలా చెయ్యాలి:
ఇంటర్మీడియట్ పరీక్షల్లో వచ్చినటువంటి సబ్జెక్టుల వారి మార్కులను ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వెబ్సైట్ లోని డిక్లరేషన్ ఫారం లో లాగిన్ అయ్యి, మార్కులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసి, ప్రతి సబ్జెక్టు యొక్క మార్కులను సరిచూసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడానికి జూన్ 5వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఇప్పుడు డిక్లరేషన్ ఫారం లో మార్కులను ఏ విధంగా సరి చేసుకోవాలో చూద్దాం.
- ముందుగా ఏపీ ఎంసెట్ వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/EAPCET ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో ” declaration form” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ , రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- ఫామ్ ఓపెన్ అవుతుంది అందులో మీరు ఇచ్చిన ఎంటర్ మార్కుల జాబితా సబ్జెక్టుల వారిగా కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేయండి.
- కరెక్ట్ గా లేని సబ్జెక్టులో మార్పులను సరిచేసుకొని ఎడిట్ చేయండి
- ఎడిట్ చేసి మళ్ళీ డిక్లరేషన్ ఫారంని సబ్మిట్ చేయండి
ఏపీ ఎంసెట్ లో ఎంత ర్యాంకు వస్తే టాప్ టెన్ కాలేజీలో సీటు వస్తుంది
ఇంటర్ మార్కులు మళ్లీ ఎందుకు ఎడిట్ చేయాలి?:
ఎంసెట్లో వచ్చిన మార్కుల ఆధారంగా అలాగే ఇంటర్మీడియట్ లో వచ్చినటువంటి మార్కులలో 25% మార్పులను రేటేజి మార్కులుగా కలిపి, విద్యార్థులకు ర్యాంక్స్ కేటాయిస్తారు. ఇంటర్మీడియట్ మార్కులు సరిగ్గా లేకపోతే విద్యార్థులకు ర్యాంకులు కేటాయించడంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండడానికి ఇంటర్ విద్యార్థులు తప్పనిసరిగా వారి యొక్క ఇంటర్ సబ్జెక్టుల వారి మార్కులను, డిక్లరేషన్ ఫారంలో తప్పనిసరిగా ఎడిట్ చేసి మళ్లీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఆఖరి తేదీ ఏమిటి?:
డిక్లరేషన్ ఫారం లో ఇంటర్ మార్కులను ఎడిట్ చేసి సబ్మిట్ చేయడానికి జూన్ 5వ తేదీ వరకు సమయం ఇచ్చారు. కావున ఇంటర్ విద్యార్థులు తప్పనిసరిగా జూన్ 5వ తేదీలోగా ఎడిట్ చేయండి. ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది.
AP EAMCET Declaration Form Link
పైన తెలిపిన లింకు ద్వారా వెంటనే డిక్లరేషన్ ఫామ్ లాగిన్ అయ్యి, ఇంటర్మీడియట్ మార్కులను సబ్మిట్ చేయండి.
