TS Inter supplementary exams results 2025 official date: check results @tgbie.cgg.gov.in/

TS inter supplementary exams results 2025:

తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు శుభవార్త. ఫలితాలను జూన్ 16వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. పరీక్ష ప్రశ్నా పత్రాల మూల్యాంకనం మే 29 నే ప్రారంభం కాగా రెండో విడత మూల్యాంకనం మే 31వ తేదీ నుండి ప్రారంభించారు. అయితే ఈ పరీక్ష ప్రశ్న పత్రాల మూల్యాంకనాన్ని జూన్ 10వ తేదీతో పూర్తి చేసి, జూన్ 16వ తేదీన ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలియజేశారు. మూల్యాంకనం పూర్తయిన తర్వాత మిగిలినటువంటి పనులు త్వరగా పూర్తి అయినట్లయితే, ఫలితాలను జూన్ 13 లేదా 14వ తేదీన కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ఫలితాలకు సంబంధించిన మరికొంత సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఎంతమంది అప్లై చేశారు:

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇంటర్ వార్షిక పరీక్షలు ఫెయిల్ అయిన వారు 2.89 లక్షల మంది కాగా, ఇంప్రూవ్మెంట్ కోసం 1.23లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Join Whats App Group

ఫలితాలు విడుదల చేసే అఫీషియల్ తేదీ:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ రాత పరీక్షల ఫలితాలను జూన్ 16వ తేదీన విడుదల చేయనున్నారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం త్వరగా పూర్తయి మిగిలినటువంటి పనులు కూడా త్వరగా పూర్తయినట్లయితే ఫలితాలను జూన్ 13 లేదా 14వ తేదీలలో కూడా విడుదల చేయడానికి అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ రాజీవ్ యువ వికాసం పథకం అర్హుల వివరాలు ఎలా చూడాలి

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” TS inter supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు రోల్ నెంబర్ తో పాటు డేట్ అఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన విద్యార్థి యొక్క మార్క్స్ డౌన్లోడ్ అవుతాయి
  5. మార్క్స్ మెమో ప్రింట్ అవుట్ తీసుకోండి

TS Inter Supplementary Results Website

FAQ’s:

1. తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు?

జూన్ 16వ తేదీన పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు

2. మొత్తం ఎన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు?

4.12 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు ఫీజు చెల్లించారు.