AP Housing For All Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల స్థలం లేని వారందరికీ ఇళ్ల స్థలాలు కల్పించే విధంగా, అర్హులైన లబ్ధిదారుల నుండి ఇళ్ల స్థలాల మంజూరు కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి మూడు సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కైతే రెండు సెంట్లు స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీనికి అనుగుణంగా పెనమలూరు మరియు గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని మండలాల్లో లబ్ధిదారులు దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం ద్వారా ఇళ్ల స్థలాల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా CPLA ప్రత్యేక కార్యదర్శి విజయలక్ష్మి నిన్న విజయవాడ కేంద్రంగా జరిగినటువంటి సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులైనటువంటి ప్రజలకు ఇళ్ల స్థలాల మంజూరు కి సంబంధించి అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది .అయితే ఈ ఇళ్ల స్థలాల పథకానికి సంబంధించి ఉండవలసిన అర్హతలు, నిబంధనలు, ఎలా అప్లై చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:
ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల స్థలాలు లేని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు చేసుకునేటువంటి లబ్ధిదారులకు ఎన్ని సెంట్లు ఇళ్ల స్థలం ప్రకటిస్తారనేది క్రింది విధంగా ఉంది.
- పట్టణ ప్రాంత ప్రజలకు : 2 సెంట్ల స్థలం
- గ్రామీణ ప్రాంత ప్రజలకు: 3 సెంట్లు స్థలం కేటాయిస్తారు.

ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?:
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఇళ్లస్థలం పొందాలి అంటే ఈ క్రింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి
- పేద కుటుంబాలు
- ఇంటి స్థలం లేని వారు
- గతంలో అప్లై చేయనివారు.
ఏపీలో తల్లికి వందనం పథకం రెండో విడత అర్హుల జాబితా
అవసరమైన డాక్యుమెంట్లు :
ఇంటి స్థలాల మంజూరు కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.
- ఆధార్ కార్డ్
- రేషన్ కార్డ్
- కుల , ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
- అడ్రస్ ప్రూఫ్ సర్టిఫికెట్ / లేదా రెసిడెన్సి సర్టిఫికెట్

దరఖాస్తు ఎలా చేసుకోవాలి?:
- గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు
- లేదా, స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా
వెరిఫికేషన్ ప్రక్రియ:
PEIMS ప్లాట్ఫారం ఆధారంగా వెరిఫికేషన్ జరుగుతుంది. అర్హుల జాబితాని త్వరలో విడుదల చేస్తారు.
అధికారుల ముఖ్యమైన సూచన :
అర్హులైన లబ్ధిదారులు త్వరగా దగ్గరలోని గ్రామ వాడ సచివాలయం ద్వారా గాని లేదా తహసిల్దార్ కార్యాలయం ద్వారా వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు కొరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం ప్రారంభ తేదీ వచ్చేసింది : ఇలా అప్లై చేయండి
గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయినటువంటి లబ్ధిదారులకు మళ్ళీ అవకాశం కల్పిస్తూ, వారు ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వారికి మరొక అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం:
ఇప్పటికే రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఇళ్ల స్థలాల మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది. ఇది మీ ఇంటి కలను సహకారం చేసే ఒక గొప్ప అవకాశం అవుతుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి దరఖాస్తు చేసుకునే విషయంలో ఆలస్యం చేయకండి.
