TS 10th supplementary exams 2025 results:
తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత విడుదల చేయనున్నారు. జూన్ మూడో తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని రోజులు పరీక్ష పత్రాల మూల్యాంకనం చేసిన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు, ఇప్పుడు పరీక్ష పత్రాలు మూల్యాంకనం ముగిసినందున ఫలితాలను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 50 వేల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. పరీక్షలు రాసిన విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్ లోనే రిజల్ట్స్ ని చెక్ చేసుకునే విధంగా అధికారులు వెసులుబాటు కల్పించారు. ఇప్పుడు ఈ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో పూర్తి వివరాలు ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ మరియు సమయం:
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఫలితాలు విడుదల ఎప్పటికీ ఆలస్యమైందినా, ఈ ఫలితాలను త్వరగా విడుదల చేయాలని అధికారులు భావించి వెంటనే ఫలితాలు విడుదల చేయడానికి ఏర్పాటు చేశారు. విద్యార్థులు మీ మొబైల్ లో ఫలితాలను చెక్ చేసుకోండి.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:
తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారాడౌన్లోడ్ చేసుకోండి.
10th బోర్డు పరీక్షలు ఇకపై సంవత్సరానికి రెండుసార్లు : Official
- ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ లోనికి వెళ్ళండి.
- అక్కడ హోం పేజీలో ” TS 10th supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసే సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన మీకు ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
- మార్క్స్ మెమో అని ప్రింట్ అవుట్ తీసుకోండి.
- స్కూల్ హెడ్మాస్టర్ వారు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన ఒరిజినల్ మార్క్స్ మెమో కూడా మీకు తర్వాత అందించడం జరుగుతుంది.
TGBSE 10th Results Website: Click Here
FAQ’s:
1. తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2025 ఫలితాలను ఎప్పుడు విడుదల చేయనున్నారు?
జూన్ 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి
2. ఫలితాలను చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?
https://bse.telangana.gov.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు.
3. వెబ్సైట్లో ఫలితాలు డౌన్లోడ్ కాని వారు ఏం చేయాలి?
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారి వెబ్సైట్లో ఫలితాలు డౌన్లోడ్ కాని వారు, విద్యార్థుల యొక్క స్కూల్ హెడ్మాస్టర్ ని సంప్రదించి వారి చేత ఫలితాలు చూసుకోవచ్చు.
