AP EAMCET 2025:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలను జూన్ 8వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎంసెట్ ఫలితాలను రెండోసారి విడుదల చేయనున్నారు. 2nd phase రిజల్ట్స్ కేవలం గతంలో ఇంటర్మీడియట్ మార్కులను అప్లోడ్ చేయని ఇతర బోర్డుల విద్యార్థులు, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ పరీక్షలు రాసి మళ్ళీ పాస్ అయిన విద్యార్థులు జూన్ 15వ తేదీ నాటికి ఎంసెట్ వెబ్సైట్లో డిక్లరేషన్ ఫారం లో మరియు ఇంటర్మీడియట్ మార్కులను అప్లోడ్ చేయడం జరిగింది. ఇలా అప్లోడ్ చేసిన 15 వేల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ సెకండ్ ఫేజ్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. ఎంసెట్ కౌన్సిలింగ్ లో సీట్ పొందాలి అంటే అభ్యర్థికి కచ్చితంగా ర్యాంక్ కార్డు ఉండాలి కాబట్టి, ఆ పదిహేను వేల మంది విద్యార్థులకు సెకండ్ ఫీజు రిజల్ట్స్ కింద ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే విధంగా మరొకసారి ఫలితాలని విడుదల చేయనున్నారు. ఆ ఫలితాలు కూడా జూన్ 23వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం.
AP ఎంసెట్ 2025 2nd Phase రిజల్ట్స్ ఎవరికోసం?:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 సెకండ్ ఫేజ్ ఫలితాలు కేవలం గతంలో డిక్లరేషన్ ఫారం లో ఇంటర్మీడియట్ మార్కులను అప్లోడ్ చేయని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వారు జూన్ 15వ తేదీ నాటికి అప్లోడ్ చేయడం జరిగింది. ఇలా వారి యొక్క ఇంటర్మీడియట్ మార్కుల వివరాలను ఇటీవల వెబ్సైట్లో అప్లోడ్ చేసిన 15,000 మందికి మాత్రమే ఈ 2nd Phase ఫలితాలను విడుదల చేస్తారు. వీరు ఈ సెకండ్ ఫేజ్ ఫలితాల ద్వారా వారి యొక్క ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
2nd Phase ఫలితాలు విడుదల తేదీ?:
2nd phase ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలను 23వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఫలితాలు ఆలస్యమైనందున త్వరగా విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
AP RGUKT IIIT 2025 మెరిట్ లిస్టు విడుదల : Download
ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
- ముందుగా ఏపీ ఎంసెట్ 2025 అధికారికి వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP EAMCET 2025 Download Rank Card ‘ ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన ర్యాంకర్ డౌన్లోడ్ అవుతుంది. అది ప్రింట్ అవుట్ తీసుకోండి
ఏపీ ఎంసెట్ 2025లో 90 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది
పైన తెలిపిన విధంగా ఏపీ ఎంసెట్ సెకండ్ ఫీజు ఫలితాలను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోగలరు.
