TS EAMCET 2025:
తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ మరియు అడ్మిషన్ల షెడ్యూల్ కొరకు కొన్ని వేల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఆలస్యమైంది. అయితే తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జూన్ నెలాఖరులోగా విడుదల చేసి, అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. జూలై మొదటి వారం లేదా రెండో వారంలో సర్టిఫికెట్ల పరిశీలన చేసి వెబ్ ఆప్షన్స్ తీసుకొని, సీట్ అలాట్మెంట్ చేయడం ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే నుండి ఆగస్టు 14వ తేదీ నాటికి మొదటి సంవత్సర ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించాలని నోటీసు విడుదలైన నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎంసెట్ 2025 అడ్మిషన్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూసి తెలుసుకుందాం.
TS EAMCET 2025: Expected Dates (Not Official):
| ఎంసెట్ 2025 అంశాలు | అంచనా తేదీలు |
| నోటిఫికేషన్ విడుదల తేదీ | జూన్ 28 నుండి 30 మధ్య |
| సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీ | జూలై 3 నుండి జూలై 10 మధ్య |
| వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ | జూలై 7 నుండి జూలై 12 మధ్య |
| మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ | జూలై 15 లేదా 16వ తేదీ |
| కాలేజీలలో రిపోర్టింగ్ చేసే తేదీ | జూలై 17 నుండి జూలై 22 మధ్య |
( తెలంగాణ ఎంసెట్ 2025 అధికారిగా కౌన్సిలింగ్ తేదీలు వెలువడిన వెంటనే ఇక్కడ అప్డేట్ చేయబడుతాయి )
TS ఎంసెట్ 2025లో 20000 నుండి 1,45,000 మధ్య ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలో సీటు వస్తుంది
కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు:
- తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్
- ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
- TC ( ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ )
- ఆధార్ కార్డ్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- ఇన్కమ్ సర్టిఫికెట్
- ఆధార్ తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్
AP ఎంసెట్ 2025 2nd Phase Results విడుదల
కౌన్సిలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది?:
- ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మీరు అధికారిక వెబ్సైట్లోరిజిస్టర్ చేసుకోవాలి.
- ఎంపిక చేసిన హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్లి సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవాలి.
- ఆ తర్వాత విద్యార్థులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ని ఎంపిక చేయాలి. అంటే మీరు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ కోసం చూస్తున్నారు అవి ఎంపిక చేసుకొని సబ్మిట్ చేయాలి
- సీట్ అలాట్మెంట్ రిజిస్టర్ వస్తుంది.
- మీరు సీట్ ఫిక్స్ చేస్తే, ఫీజు చెల్లించి కాలేజీకి రిపోర్ట్ చేయాలి.
ముఖ్యమైన సూచనలు:
- ఎంసెట్లో ర్యాంకు సాధించిన వారందరూ అవసరమైన సర్టిఫికెట్స్ అన్ని రెడీ చేసుకోవాలి
- వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ సమయంలో మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీరు ఏ కాలేజ్ లో ఏ బ్రాంచ్ కోరుకుంటున్నారో అవి సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి
- రిజర్వేషన్లు, లోకల్, నాన్ లోకల్ విధానాలను బట్టి సీట్ అలాట్మెంట్ చేస్తారు.
