AP ఆడబిడ్డ నిధి పథకం 2025 కొత్త మార్గదర్శకాలు విడుదల: మహిళ ఎకౌంట్లో నెలకి 1500 డైరెక్టుగా జమ చేస్తారు.

AP Aadabidda Nidhi Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. సూపర్ సెక్స్ పథకంలో ముఖ్యమైనటువంటి పథకం అయినందున, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళల ఎకౌంటు లో నెలకు ₹1500 రూపాయలు జమ చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ పథకానికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు ఏమిటి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

ఆడబిడ్డ నిధి పథకం తాజా మార్గదర్శకాలు ఏమిటి?:

Join Whats App Group

  • ప్రతినెలా పదో తేదీలోపు మహిళల అకౌంట్లో 1500 రూపాయలు జమ చేయడం జరుగుతుంది.
  • బెనిఫిషరీ స్టేటస్ ను గ్రామ వార్డు సచివాలయంలో చెక్ చేసుకునే అవకాశం ఉంది
  • ఈ పథకం వర్తించాలి అంటే అన్ని సర్టిఫికెట్లను సబ్మిట్ చేసిన వారికి మాత్రమే లభిస్తుంది.
  • ఆడబిడ్డ నిది పథకాన్ని P4 కు (Public, Private, People, Partnership) అనుసంధానం చేసి, మహిళలకు ఆర్థిక చేయూత అందించే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
  • ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది మహిళలకు లబ్ధి చేయకూరనుంది.

ఆడబిడ్డ నిది పథకం అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

AP IIIT 2025 అడ్మిషన్స్ మెరిట్ లిస్ట్ విడుదల

  • దరఖాస్తు చేసుకునే మహిళ ఆంధ్ర ప్రదేశ్ నివాసితురాలై ఉండాలి
  • ఆ మహిళకు 18 నుండి 59 సంవత్సరాల లోపు వయసు ఉండాలి
  • కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.2 లక్షల లోపు, అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 1.8 లక్షల లోపు ఆదాయం కలిగి ఉన్నవారు అర్హులు
  • ప్రభుత్వ ఉద్యోగం లేదా ఇన్కమ్ టాక్స్ చెల్లించే కుటుంబానికి చెందిన వారైతే అనర్హులు
  • ఓటర్ గుర్తింపు కార్డు ఉండాలి

అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు:

దరఖాస్తు చేసుకునే మహిళకు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

  • ఆధార్ కార్డ్
  • రేషన్ కార్డ్
  • బ్యాంకు ఖాతా వివరాలు
  • వయసును నిరూపించే సర్టిఫికెట్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం
  • నివాస ధ్రువీకరణ పత్రం

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:

  • ఈ పథకానికి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు www.gramawardsachivalay. ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు.
  • లేదంటే గ్రామ వార్డు సచివాలయంలోని అధికారులను సంప్రదించి అప్లై చేసుకోవచ్చు.
  • వారు మీకు దరఖాస్తు ఫారం పూర్తి చేసి అప్లై చేస్తారు.

లబ్ధిదారుల లిస్టు ఎలా చూసుకోవాలి?:

  • ఈ పథకం ఇంకా ప్రారంభించబడలేదు. ప్రారంభించిన తర్వాత మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయం కి వెళ్లి, లబ్ధిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
  • లేదా ఆన్లైన్లో కూడా చెక్ చేసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.