AP RGUKT IIIT 2025:
AP RGUKT IIIT 2025 అడ్మిషన్స్ కి దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు శుభవార్త. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నటువంటి మెరిట్ లిస్ట్ ని జూన్ 23 2025న విడుదల చేయడానికి అధికారులు ఫైనల్ డేట్ ని ఫిక్స్ చేశారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా అయినటువంటి ఈ మెరిట్ లిస్టుని, ఇకపై వాయిదా లేకుండా చెప్పిన డేట్ కి ఫైనల్ గా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత అందులో పేర్లు కలిగిన విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. ఏపీ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ 2025 అడ్మిషన్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూసి తెలుసుకుందాం.
మెరిట్ లిస్ట్ ఎప్పుడెప్పుడు రద్దుచేశారు? – మళ్ళీ ఎప్పుడు విడుదల చేయనున్నారు:
- ఫస్ట్ డేట్: జూన్ 5, 2025 వాయిదా వేశారు
- సెకండ్ డేట్: జూన్ 20, 2025 మళ్లీ వాయిదా వేశారు
- ఫైనల్ డేట్: జూన్ 23, 2025 ( కన్ఫామ్)
మెరిట్ లిస్ట్ ఎలా చూసుకోవాలి?:
విద్యార్థులు మెరిట్ లిస్ట్ ని ఆర్జీయూకేటి అధికారిక వెబ్సైట్ అయినటువంటి https://admissions25.rgukt.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.
మెరిట్ లిస్టులో ఏముంటుంది?:
- అప్లికేషన్ నెంబర్
- విద్యార్థి పేరు మరియు తండ్రి పేరు
- విద్యార్థి యొక్క కేటగిరి, జెండర్ మరియు ప్రాంతం
- విద్యార్థి ఏ క్యాంపస్ కి allot అయ్యాడు
- ధ్రువీకరణ తేదీ మరియు సెంటర్ వివరాలు ఉంటాయి
AP EAMCET 2025 Revised Rank Cards Released
AP RGUKT IIIT 2025 – మొత్తం క్యాంపస్ సీట్స్ వివరాలు:
| క్యాంపస్ పేరు | అందుబాటులో ఉన్న సీట్లు |
| నూజివీడు | 1100+ |
| RK వ్యాలీ | 1100+ |
| శ్రీకాకుళం | 1100+ |
| ఒంగోలు | 1100+ |
మొత్తం త్రిబుల్ ఐటీ సీట్లు: 4400+
ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ తేదీలు, వెబ్ ఆప్షన్స్ , సర్టిఫికెట్ల పరిశీల వివరాలు
తదుపరి ప్రాసెస్ ఏమిటి?:
- మెరిట్ లిస్టులో పేరు ఉన్నట్లయితే :
- ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు జిరాక్స్ కాపీలను తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి
- ధ్రువీకరణ తేదీలు : క్యాంపస్ ల వారీగా జూన్ 30 నుండి జూలై 5వ తేదీ వరకు ఉంటాయి
కావలసిన సర్టిఫికెట్స్ వివరాలు:
- పదో తరగతి మార్క్స్ మెమో
- ఆధార్ కార్డ్ సర్టిఫికెట్
- కుల ధ్రువీకరణ పత్రాలు
- ఇన్కమ్ సర్టిఫికెట్
- నాలుగో తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
ముఖ్యమైన సమాచారం:
- ఈసారి ఏపీ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ 2025 అడ్మిషన్స్ కి 50వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
- అడ్మిషన్స్ ఎంపిక ప్రక్రియ పూర్తిగా పదవ తరగతిలో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా ఉంటుంది.
- మెరిట్ మార్కులు విడుదల తర్వాత క్యాంపస్లను allot చేస్తారు
RGUKT IIIT 2025 మెరిట్ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది ముఖ్యమైనటువంటి సమాచారం. జూన్ 23 2025న మెరిట్ లిస్ట్ని అధికారికి వెబ్సైట్లో ఉంచుతారు. అడ్మిషన్స్ కి దరఖాస్తులు చేసుకున్న వారు ఆ మెరిట్ లిస్టు డౌన్లోడ్ చేసుకుని అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
