AP అన్నదాత సుఖీభవ లబ్దిదారుల జాబితా: రైతుల అకౌంట్ లో ₹7,000/- జమ అయ్యే తేదీ, eKYC ఎలా చెయ్యాలి?- పూర్తి వివరాలు

Annadatha Sukhibhava – PM Kisan Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని రైతన్నల కోసం వారికి ఆర్థిక సహాయం అందించే విధంగా ” annadatha sukhibhava PM Kisan” పథకాన్ని జూన్ 20వ తేదీన ప్రారంభించబోతోంది. జూన్ 20వ తేదీన మొదటి విడత కింద కేంద్ర ప్రభుత్వం ₹2,000/-, రాష్ట్ర ప్రభుత్వం ₹5,000 రూపాయలు మొత్తం ₹7,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయనుంది. ఇలా మొత్తం మూడు విడతల్లో కలిపి రైతుల అకౌంట్లో ₹20,000 రూపాయలు సంవత్సరానికి డిపాజిట్ చేయనున్నారు. ఈ పథకానికి అర్హులైన వారు eKYC ఏ విధంగా చేసుకోవాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, డబ్బులు డిపాజిట్ అయినాయా లేదా ఎలా చూసుకోవాలి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మొత్తం రుసుము మూడు విడతల వివరాలు:

Join WhatsApp group

విడతలు మొత్తం డబ్బులు కేంద్ర సహాయం రాష్ట్ర సహాయండబ్బులు విడుదల చేసే తేదీ
మొదటి విడత₹7,000/-₹2,000/-₹5,000/-జూన్ 20, 2025
రెండవ విడత₹7,000/-₹2,000/-₹5,000/- ఆగస్టు 2025(అంచనా)
మూడవ విడత₹6,000/-₹2,000/-₹4,000/- నవంబర్ 2025 (అంచనా)

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొత్తం డబ్బులు జమ చేసేది: ₹20,000/-

తల్లికి వందనం పథకం కొత్త లబ్ధిదారుల జాబితా విడుదల: వీరికి జూలైలో డబ్బులు జమ

ఈ పథకానికి ఎవరు అర్హులు?:

  • లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు అయి ఉండాలి
  • భూ పట్టాదారు రైతులు మరియు కూలీ రైతులు అర్హులు
  • తప్పనిసరిగా పిఎం కిసాన్ లబ్ధిదారులై ఉండాలి
  • eKYC పూర్తి చేసి ఉండాలి.
  • లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి.

తల్లికి వందనం పథకం కోసం కొత్త వారిలో దరఖాస్తు చేయండి

e-KYC ఎలా చేసుకోవాలి?:

  1. ముందుగా https://pmkisan.gov.in/ వెబ్సైట్ని సందర్శించండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో “eKYC” ఆప్షన్ ని ఎంచుకోండి
  3. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. OTP ద్వారా వెరిఫై చెయ్యండి
  5. eKYC సక్సెస్ఫుల్ అని స్క్రీన్ పైన కనిపిస్తుంది.
  6. ఇలా వస్తే మీ ఈ కేవైసీ పూర్తి అయిందని అర్థం.

Status (స్టేటస్) ఎలా చెక్ చేసుకోవాలి?:

పిఎం కిసాన్ లింకు ద్వారా చూసుకోవాలి.

ఏపీ లా సెట్ మరియు పీజీ సెట్ ఫైనల్ కీ ఈరోజు విడుదల

  • పీఎం కిసాన్ అధికారికి వెబ్సైట్: https://pmkisan.gov.in/
  • beneficiary status ఆప్షన్ పై క్లిక్ చేయండి
  • ఆధార్ కార్డు నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి
  • మీ అమౌంట్ కి సంబంధించిన సమాచారం చూపిస్తుంది.
  • ” ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ స్టేటస్ లింక్”: https://annadathasukhibhava.ap.gov.in/
  • ఆ లింక్ పై క్లిక్ చేసి ” know your status” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • లబ్ధిదారుడి ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  • మీరు అర్హులా కాదా అనే స్టేటస్ అక్కడ చూపిస్తుంది.

ముఖ్యమైన సమాచారం:

  • అధికారిక వెబ్సైట్లో మాత్రమే ఈ యొక్క వివరాలు తెలుసుకోండి. ఫేక్ వెబ్సైట్స్ ని నమ్మకండి.
  • పథకం డబ్బులు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం DBT ద్వారా అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు
  • ఒకవేళ డబ్బులు డిపాజిట్ కాకపోతే, గ్రామ సచివాలయం లేదా రైతు భరోసా కేంద్రంలో లో సంప్రదించండి.

అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రైతన్నలకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రారంభించిన పథకం. ఈ పథకం కింద మొత్తం 20 వేల రూపాయలు సంవత్సరానికి డిపాజిట్ చేస్తారు. మొదటి విడతగా జూన్ 20వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిపి 7000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆరోజున డబ్బులు డిపాజిట్ అవుతాయి కాబట్టి, లబ్ధిదారులు మీ మొబైల్ నెంబర్ ని యాక్టివ్ గా ఉంచుకొని SMS వచ్చిందో లేదో చెక్ చేసుకోండి.