AP Gruhini Scheme 2025:
ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం లాగానే మహిళల కోసం మరొక పథకాన్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాపు మహిళల కోసం కొత్తగా “గృహిణి పధకం” ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ పథకానికి కాపు వివాహిత మహిళలు మాత్రమే అర్హులు. అర్హులైన మహిళ అకౌంట్లో ₹15 వేల రూపాయలు డిపాజిట్ అవుతాయి.ఈ పథకానికి ఉండవలసిన అర్హతలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఏపీ గృహిణి పథకం హైలైట్స్ (Expected):
- పథకం పేరు: గృహిణి పథకం 2025
- టార్గెట్ గ్రూప్: కాపు మహిళలు ( ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది )
- ఎంత ఆర్థిక సహాయం: ₹15,000/- వరకు సంవత్సరానికి చెల్లిస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో లేదా గ్రామ సచివాలయం ద్వారా ( ఇంకా స్పష్టత రాలేదు)
- లబ్ధిదారులు ఎంపిక ఎలా?: ఆధార్, ఆదాయ ప్రమాణాల ఆధారంగా
గృహిణి పథకం లబ్ధి పొందే వారు ఎవరు?:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించబోయే గృహిణి పథకానికి కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులు.ఇది ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి 15వేల రూపాయలు కాపు మహిళలకు ఆర్థిక సహాయం కింద అందించనుంది.
తల్లికి వందనం పధకం స్టేటస్ చెక్ వాట్సాప్ లోనే చేసుకోండి
గృహిణి పథకం దరఖాస్తు విధానం (Expected):
స్టెప్ 1: ముందుగా అర్హతలు తెలుసుకోండి.
- ఈ పథకానికి అప్లై చేయాలి అంటే ఆ మహిళ కాపు కులానికి చెందిన వారే ఉండాలి
- ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి.
- లబ్ధిదారునికి బ్యాంక్ అకౌంట్ మరియు ఆధార్ కార్డు ఉండాలి.
- ఆదాయ పరిమితి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉండాలి
- పెళ్లయిన మహిళ అయి ఉండాలి
స్టెప్ 2: గ్రామ సచివాలయం ద్వారా అప్లికేషన్:
- పథకం ప్రారంభమైన తర్వాత అభ్యర్థులు గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- అక్కడ మీకు ప్రత్యేకంగా gruhani Pathakam application form ఇవ్వచ్చు.
- ఫామ్ తో పాటు కింది డాక్యుమెంట్ అవసరం అవుతాయి.
తల్లికి వందనం పధకం కొత్త లిస్ట్ విడుదల : వీరికి జూలై లో డబ్బులు జమ
అవసరమైన డాక్యుమెంట్స్:
- ఆధార్ కార్డ్
- బ్యాంకు పాస్ బుక్ ఫోటో కాపీ
- కాపు కులానికి చెందిన సర్టిఫికెట్ కాపీ
- ఆదాయ సర్టిఫికెట్
- నివాస ధ్రువీకరణ పత్రం
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
గృహిణి పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు?, అప్లికేషన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?:
ఈ పథకాన్ని ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రారంభించలేదు. ఈ 2025 సంవత్సరంలోనే కొత్తగా ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
గమనిక:
గృహి పథకం ఇంకా అధికారికంగా ప్రారంభించలేదు. తల్లికి వందనం పధకంలాగానే కాపు మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని 2025 లో ప్రారంభించాలని సూచనప్రాయంగా ఆలోచించింది. అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే మా వెబ్సైట్ ద్వారా మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. కావున వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ లో వెంటనే జాయిన్ అవ్వండి
