TGSRTC Training Notification 2025:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC ) హైదరాబాద్ రీజియన్ నుండి 2020 మే నుండి 2025 మధ్య ఉత్తీర్ణులైనటువంటి బీటెక్ మరియు డిప్లమా అభ్యర్థులకు అప్రెంటిస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి వారికి సర్టిఫికెట్ తో పాటు, అనుభవం కూడా లభిస్తుంది.
ట్రైనింగ్ కు ఉండవలసిన అర్హత :
- చదువు: డిప్లమా లేదా డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు అర్హులు
- పూర్తి కావాల్సిన సంవత్సరం : మే 2020 నుండి 2025 మధ్య చదువుకున్నవారై ఉండాలి.
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం రిపోర్ట్ చేయవలసిన ప్రదేశాలు :
సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు, హైదరాబాద్ డిపోలోని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి వెళ్లి రిపోర్ట్ అవ్వాలి.
ఇతర శాఖల విద్యార్థులు టి ఎస్ ఆర్ టి సి హైదరాబాద్ రీజియన్ ఆఫీసులోని విభాగాలకు వెళ్లాలి.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల తేదీ
అప్లికేషన్ తేదీలు:
ప్రారంభ తేదీ: 10th జూన్, 2025
చివరి తేదీ: 30th జూన్, 2025
సమయం: ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ( వారంలో సోమవారం నుండి శనివారం వరకు )

సంప్రదించవలసిన వ్యక్తి:
- ప్రాంతీయ అధికారి వారి కార్యాలయం: TSRTC, 2వ అంతస్తు,కాచిగూడ బస్ స్టేషన్ , హైదరాబాద్
- మొబైల్ నెంబర్: 7382822783
తెలంగాణ ఎంసెట్ 2025 last rank colleges List
ముఖ్యమైన విషయాలు:
- ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ప్రభుత్వ ఉద్యోగ భద్రత కలిగిన జాబ్ అయితే కాదు, కానీ ఈ అనుభవం ఫ్యూచర్ నోటిఫికేషన్ లకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది
- టిఎస్ఆర్టిసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలో అనుభవం పొందే ఒక ప్రత్యేకమైన అవకాశం
- సరైన ప్రశ్న పత్రాలు ట్రైనింగ్ కు హాజరయ్యే అభ్యర్థులు తీసుకొని వెళ్ళాలి.
చివరగా:
2020 నుండి 2025 మధ్య డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు ఇది చాలా మంచి అవకాశం. టిఎస్ఆర్టిసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలో ట్రైనింగ్ పొందడమే కాక, భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇంకా ఆలస్యం చేయకుండా జూన్ 10 2025 నుండి జూన్ 30 2025 వరకు హాజరై రిజిస్టర్ చేసుకోండి.
