TS inter supplementary exams 2025 results:
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల కోసం 4.12 లక్షల మంది విద్యార్థులు ఎంతగానో చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితాలను తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు జూన్ 16వ తేదీన విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలను మే 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పరీక్ష పత్రాలు మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు, విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్ లోనే ఫలితాలను ఒక్క సెకండ్ లో చెక్ చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ?:
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ 16వ తేదీ ఉదయం విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. రెండు సంవత్సరాల పరీక్ష ఫలితాలు ఒకేరోజు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 894 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఎంసెట్ 2025 last ranked colleges list
- ముందుగా తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో ” Telangana Inter 1st year and 2nd year supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
- వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి
FAQ’s:
1. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?
జూన్ 16వ తేదీ ఉదయం పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది.
2. మొత్తం ఎన్ని లక్షల మంది సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు ఫీజు చెల్లించారు?
4.12లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించారు
