TS EAMCET 2025 :
తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల చేసి ఇప్పటికే నెల రోజులు కావస్తోంది. అయితే చాలామంది విద్యార్థులకు ఎక్కువ ర్యాంకులు వచ్చాయి మరి కొంత మందికి తక్కువ ర్యాంకులు వచ్చాయి. వారికి వచ్చిన ర్యాంకులు ఆధారంగా ఏ కాలేజీలో ఏ బ్రాంచెస్ లో సీటు వస్తుందో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆత్రుత వారికి ఉంటుంది. అలాంటి విద్యార్థుల కోసం మేము గత సంవత్సరాలలో ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి వచ్చిన కాలేజీలను ఆధారంగా చేసుకుని ఈ డేటా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కావున ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
TS EAMCET 2025 last rank colleges list:
తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాల్లో ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుందో ఈ క్రింది టేబుల్స్ ద్వారా తెలుసుకోండి.
| కాలేజ్ పేరు | బ్రాంచ్ | క్లోజింగ్ ర్యాంక్ రేంజ్ | క్యాటగిరి |
| మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ | ME/EEE | 98,000-1,30,000 | OC Boys |
| వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ | Mechanical | 98,000-1,30,000 | OC Boys |
| ACE ఇంజనీరింగ్ కాలేజ్ | CSE (IoT) | 1,00,000-1,50,000 | BC-A Boys |
| బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | ECE | ~1,23,381 | OC Girls |
| చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) | CSE | ~1,30,000 | ST |
| JNTU (JNTUH, సుల్తాన్పూర్ క్యాంపస్ ) | B.Tech (General) | ~1,22,714 | SC/ST |
| విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ వుమెన్ | ECE | ~1,25,681 | SC GIRLS |
| వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | CSE | ~1,16,616 | SC GIRLS |
| వరంగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ | EEE | ~1,11,740 | General |
పైన తెలిపిన డేటా మొత్తం గత సంవత్సరాలలో ఎక్కువ ర్యాంకులు వచ్చిన వారు సాధించినటువంటి కాలేజీల వివరాలను ఆధారంగా చేసుకుని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ 2025లో కౌన్సిలింగ్ జరిగిన తర్వాత ఈ డేటాలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కచ్చితంగా ఈ ర్యాంకులో వచ్చిన వరకే సీట్స్ వస్తాయి అని ఏమీ లేదు. ఇది ఒక అంచనా మాత్రమే.
తెలంగాణ ఎంసెట్ 2025లో 10,000 నుండి 1,50,000 మంది ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో సీటు వస్తుంది
TS ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది?:
తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ 2025 కు సంబంధించి కన్వీనర్ కృష్ణారెడ్డి గారి సమాచారం ప్రకారం, జూన్ చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసి జూలై మొదటి వారం లేదా రెండో వారంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఇటీవల ఆయన మీడియా ముఖంలో ప్రకటించారు. ఆగస్టు మొదటి వారం నుండి తరగతులు ప్రారంభమవుతాయని,జూలై చివర వరం నాటికి మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తవుతుందని తెలిపారు.
తెలంగాణ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ కి వెళ్లే ఆ విద్యార్థులు కచ్చితంగా మీ యొక్క సర్టిఫికెట్లు అన్నీ ఉన్నాయా లేదనేది చెక్ చేసుకుని, కౌన్సిలింగ్ కి హాజరు కాగలరు.
