AP/TG EAMCET 2025: B.Tech మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభమయ్యే తేదీ: AICTE అధికారిక ప్రకటన

B.Tech 1st Year Classes Starting Date:

అఖిల భారత సాంకేతిక విద్య మండలి (AICTE) అకాడమిక్ క్యాలెండర్ 2025-26 ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు మరియు బీటెక్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులను ఆగస్టు 14వ తేదీ నాటికి ప్రారంభించాలని అన్ని కళాశాలలకు మరియు యూనివర్సిటీలకు ఏఐసిటిఈ ఆదేశాలు జారీ చేసింది. ఏఐసిటీఈ క్యాలెండర్ కి సంబంధించిన ముఖ్యమైనటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ముఖ్యమైన మార్పులు మరియు తేదీలు:

ఏఐసిటిఈ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Join What’s App Group

అంశము ముఖ్యమైన తేదీలు
బీటెక్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభ తేదీ ఆగస్టు 14, 2025
డిప్లమా కోర్సు పూర్తి చేయాల్సిన తేదీజూన్ 14, 2025
కాలేజీలు ఫీజు వివరాలను AICTE కి పంపించే గడువుజూన్ 30, 2025
యూనివర్సిటీలు కాలేజీలో జాబితా పంపించాల్సిన గడువుజూన్ 31, 2025
అడ్మిషన్స్ తీసుకునే విద్యార్థులకు ఫీజు చెల్లింపునకు గడువుజూలై 11, 2025

ముఖ్యమైన సమాచారం:

ఏపీ ఎంసెట్ ఫైనల్ కీ ఎప్పుడు విడుదల చేస్తారు: Click here

  • డిప్లమా కాలేజీ విద్యార్థులు జూన్ 14వ తేదీ నాటికి వారి యొక్క కోర్సు పూర్తి చేసి ఉండాలి
  • బి టెక్ అడ్మిషన్ పూర్తి చేసే విద్యార్థులు జూలై 11వ తేదీలోపు వారి యొక్క ఫీజు చెల్లించాలి.
  • జూలై 31వ తేదీలోపు దేశంలోని అన్ని యూనివర్సిటీలో కళాశాలల వివరాలను సమర్పించాలి.
  • బీటెక్ మొదటి సంవత్సరం తరగతులు ఆగస్టు 14వ తేదీ నాటికి ప్రారంభించాలి. ఇది కచ్చితంగా పాటించాల్సిన నిబంధనగా AICTE ఉత్తర్వుల్లో పేర్కొంది.

గమనిక:

ఇది ముఖ్యమైనటువంటి షెడ్యూల్ కావడంవల్ల, విద్యార్థులు, కాలేజీలు మరియు యూనివర్సిటీలకు ముందుగానే అన్ని అవసమైన కార్యాచరణలు పూర్తి చేయాలని సూచన.

తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ఆలస్యం: కారణాలు ఇవే

ఏపీ, తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు?:

తెలంగాణ ఎంసెట్ ఫైనల్ రిజల్ట్స్ విడుదల ఇప్పటికే చాలా రోజులు కావస్తున్నా కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంసెట్ పరీక్షలు నుంచి ప్రాథమిక కీ విడుదల చేశారు జూన్ 14వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు. ఫైనల్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కానీ ఏపీ తెలంగాణకి సంబంధించిన ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారనేటువంటి సమాచారం ఉన్నత విద్య మండల్ నుంచి లేదు. దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. కొంతమంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో అనగా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ముందుగానే అడ్మిషన్స్ ప్రారంభమైనందున ఆ కళాశాలలో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.