TGSRTC – ITI Admissions 2025:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ( TGSRTC) నుండి ITI విద్యార్థులకు ఒక మంచి శుభవార్త. తెలంగాణ ఆర్టీసీలో ఐటిఐ ట్రైనింగ్ ప్రవేశాల కోసం మోటార్ మెకానిక్ వెహికల్, డీజిల్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్స్ లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 21వ తేదీల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
ట్రైనింగ్ నిర్వహించే ప్రదేశం:
ఐటిఐ విద్యార్థులకు ట్రైనింగ్ హైదరాబాద్ వరంగల్ వంటి ఆర్టీసీ డిపోలలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అప్రెంటీషిప్ సెంటర్లలో జరుగుతుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పొందడానికి, నైపుణ్య శిక్షణ కోసం మరియు భవిష్యత్తు ఉద్యోగాల అవకాశాల కోసం ఉపయోగించుకోండి.
ఈ శిక్షణ ఎవరికి?:
తెలంగాణ ఆర్టీసీలో శిక్షణ పొందడానికి ఈ క్రింది విద్యార్థులు మాత్రమే అర్హులు.
- ప్రస్తుతం ఐటిఐ చదువుతున్న విద్యార్థులు
- మోటార్ మెకానిక్, డీజిల్, ఫిట్టర్, పెయింటర్ వంటి ట్రేడ్స్ లో చదువుతున్నవారు.
- నైపుణ్య శిక్షణతో పాటు భవిష్యత్తులో తెలంగాణ ఆర్టీసీ నెట్వర్క్ లో ఉద్యోగ అవకాశాలపై ఆసక్తి ఉన్నవారు అర్హులు.
ఈ ప్రవేశాల యొక్క ప్రత్యేకత ఏమిటి?:
తెలంగాణ లాసెట్ మరియు పీజీ లా సెట్ ఫలితాలు విడుదల తేదీ
- ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఆర్టీసీలో ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు
- TGSRTC అధికారిక గుర్తింపు ఉంటుంది
- భవిష్యత్తు ఉద్యోగ నోటిఫికేషన్ లకు ఇది ఉపయోగపడుతుంది.
- దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://iti.telangana.gov.in ఓపెన్ చేయండి
- లాగిన్ లేదా కొత్తగా రిజిస్టర్ అవ్వండి.
- సంబంధిత ట్రేడ్ ఎంపిక చేసుకుని,దరఖాస్తు ఫారం నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి.
- ఫైనల్ గా అప్లికేషన్ సబ్మిట్ చేయండి .
ప్రవేశాల యొక్క ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యేది: ఇప్పటికే ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి
- దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ : 21st జూన్, 2025
- దరఖాస్తు లింక్ : https://iti.telangana.gov.in
- దరఖాస్తు ఫీజు ఎంత?: ఎటువంటి ఫీజు లేదు.

ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని విద్యార్థులు అస్సలు వదులుకోవద్దు. ప్రస్తుతం ఏదైనా జాబ్ రావాలి అంటే ఏ కంపెనీ అయినా ఏ ప్రభుత్వం అభ్యర్థులకు ప్రాక్టికల్ నైపుణ్యం ఉందా లేదా, గతంలో ఏమైనా శిక్షణ తీసుకున్నారు లేదా అనేది చూస్తున్నారు. ఇలాంటి సమయంలో టిజిఎస్ ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇచ్చేటువంటి టెక్నికల్ ట్రైనింగ్ మీ కెరీయర్ని మార్చడానికి ఉపయోగపడతాయి. కావున వెంటనే జూన్ 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోండి.
