AP SSC/10th supplementary exams results 2025:
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు పదో తరగతి సప్లిమెంటరీ రాత ప్రేక్షకులను మే 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించారు. మే 29వ తేదీ నుండి పరీక్ష పత్రాలు యొక్క మూల్యాంకనం ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పరీక్ష ఫలితాలను జూన్ మూడో వారంలో అనగా 17వ తేదీలోగా విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పలు కేంద్రాల్లో ప్రశ్నపత్రాల మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఫలితాలు విడుదలైన తర్వాత ఇంటర్మీడియట్ లేదా డిప్లమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పదవ తరగతి మార్క్స్ మెమో లేదా సర్టిఫికెట్స్ తప్పనిసరిగా కావాలి కాబట్టి, రిజల్ట్స్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఏపీ పదవ తరగతి సప్లమెంటరీ ఫలితాలు విడుదల తేదీ:
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ మూడో వారంలో అనగా జూన్ 17వ తేదీలోగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఫలితాలను విద్యార్థులు వాట్సాప్ లో కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా అధికారులు మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా అవకాశాన్ని కల్పిస్తున్నారు.
వాట్సాప్ లో ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల తేదీ
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా ఫలితాలను కూడా చూసుకోవచ్చు.
- ముందుగా ఈ వాట్సాప్ నంబర్ కు +9195523 00009 “HI” అని మెసేజ్ చేయండి
- ” సేవలను ఎంచుకోండి” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అందులో “ఎడ్యుకేషన్ సర్వీసెస్” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి వాటిని నోట్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
AP SSC/10th Supplementary Exams Results Website
FAQ’s:
1. ఏపీ 10th సప్లిమెంటరీ పరీక్ష ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఎప్పటినుండి ప్రారంభించారు?
మే 29వ తేదీ నుండి ప్రశ్న పత్రాల మూల్యాంకనం రాష్ట్రంలోని కొన్ని కేంద్రాల్లో ప్రారంభించడం జరిగింది
2. వాట్సాప్ ద్వారానే కాకుండా అధికారిక వెబ్సైట్ ఏమిటి?
http://bseaps.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు.
