District Court Jobs Notification 2025:
తెలంగాణాలోని జిల్లా కోర్టుల్లో పని చేయడానికి 340 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు 8th జనవరి 2025 నుండి 31st జనవరి 2025 తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ నెలలో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
ఆన్లైన్ లో జూనియర్ అసిస్టెంట్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులలో OC, OBC అభ్యర్థులు ₹600/- ఫీజు, ఇతర అభ్యర్థులు ₹400/- ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాలి.
మెట్రో రైల్వే లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణాలొని జిల్లా కోర్టుల్లో పని చేయడానికి 340 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అన్నిజిల్లాల్ల వారికి విడుదల చేశారు . ఆ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. SC, ST, EWS, OBC అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం:
జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనరల్ నౌలెడ్జి, జనరల్ ఇంగ్లీష్ టాపిక్స్ నుండి 100 మార్కులకు 100 ప్రశ్నలతో, 120 నిముషాలు సమయం కేటాయిస్తూ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పెడతారు.
తెలంగాణా గ్రామీణ సబ్ స్టేషన్స్ లో ఉద్యోగాలు: 3,200 Govt జాబ్స్
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులజు నెలకు ₹40,000/- జీతం వస్తుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ బెనిఫట్స్, TA, DA, HRA వంటి ఉంటాయి.
డాక్యుమెంట్స్ వివరాలు :
కోర్టు ఉద్యోగాలకు Apply చేసుజోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి
OTPR రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
SC, ST, OBC, EWS కుల ధ్రువీకరణ్ పత్రాలు ఉండాలి.
1st నుండి 7th వరకు స్టడీ సర్టిఫికెట్స్
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణా వెల్ఫేర్ Dept లో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్
ఎలా Apply చెయ్యాలి:
జూనియర్ అసిస్టెంట్ కోర్టు ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు తెలంగాణా అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
