AP ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | APSFL Notification 2025 | Freejobsintelugu

APSFL Notification 2025:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ నుండి 02 జనరల్ మేనేజర్, 01 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి CA, CMA, ICWA, MBA ఫైనాన్స్ విభాగాల్లో అర్హతలు కలిగి అనుభవం కూడా కలిగినవారికి అవకాశం ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.అప్లికేషన్స్ ని apsfl@ap.gov.in మెయిల్ అడ్రస్ కు మెయిల్ ద్వారా పంపించవలెను.

Join Whats App Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ 19th జనవరి 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ 31st జనవరి 2025

ఎంత వయస్సు ఉండాలి:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 244 అవుట్ సోర్సింగ్ జాబ్స్: 10th Pass

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు;

ఆంధ్రప్రదేష్ స్టేట్ ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ నుండి 03 పోస్టులతో జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్/కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. CA, CMA, ICWA, MBA ఫైనాన్స్ విభాగాల్లో అర్హతలు కలిగినవారికి అవకాశం ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:

నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. మంచి ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు.

AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు

శాలరీ వివరాలు:

APSFL ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ ఉంటాయి. ఇతర అలవెన్సుడ్, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు:

AP ఫైబర్ నెట్ ఉద్యోగాలము దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కులాలవారు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

CA, CMA, ICWA, MBA ఫైనాన్స్ అర్హత సర్టిఫికెట్స్,

1st నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్

SC, ST, OBC, EWS కాస్ట్ సర్టిఫికెట్స్ ఉండాలి.

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply

ఎలా Apply చెయ్యాలి:

APSFL ఉద్యోగాలకి అర్హతలు ఉన్న అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Apply Link

ఆంధ్రప్రదేశ్ లోని ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.