Railway RITES Notification 2025:
రైల్వేశాఖకు సంబందించిన RITES సంస్థ నుండి 32 పోస్టులతో అర్హులైన భారత అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. అసిస్టెంట్ మేనేజర్, సెక్షన్ ఆఫీసర్ వంటి చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి CA,MBA, చార్టెడ్ అకౌంటెంట్ గా అర్హతలు ఉండి 2 సంవత్సరాల వరకు అనుభవం కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖకు సంబందించిన RITES ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు చేసుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 8th జనవరి 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 4th ఫిబ్రవరి 2025 |
| రాత పరీక్ష నిర్వహించే తేదీ | 16th ఫిబ్రవరి 2025 |
| రాత పరీక్ష ఫలితాలు విడుదల తేదీ | 24th ఫిబ్రవరి 2025 |
| ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ | త్వరలో డేట్స్ విడుదల చేస్తారు |
అప్లికేషన్ ఫీజు ఎంత?:
రైల్వే RITES ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జనరల్ /OBC అభ్యర్థులకు ₹600/-, EWS, SC, ST, PWD అభ్యర్థులకు ₹300/- ఫీజు ఉంటుంది. ఆన్లైజ్ లోనే ఫీజు చెల్లించాలి.
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో Govt జాబ్స్ : 10th మాత్రమే
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
రైల్వే RITES డిపార్ట్మెంట్ నుండి 32 అసిస్టెంట్ మేనేజర్, సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. చార్టెడ్ అకౌంటెంట్, CA, ICWA, MBA చేసి 2 సంవత్సరాల వరకు అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ చేసి విధానం:
RITES రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 2.5 గంటలపాటు 125 ప్రశ్నలతో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి నెగటివ్ మార్క్స్ ఉండవు రాత పరీక్షలో అర్హత పొందినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.
పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు : No Exam, No Fee
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం 05 సంవత్సరాలు OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు అక్షరాల ₹1.2లక్షల రూపాయలు జీతం చెల్లిస్తారు ప్రతి నెల. శాలరీతో పాటు ఇతర అన్ని రకాల ఆలూవెన్సెస్ కూడా ఉంటాయి.
ఉండవలసిన సర్టిఫికెట్స్:
SSC /10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
అనుభవం కలిగిన ప్రూఫ్ సర్టిఫికెట్స్
SC, ST, OBC కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
DRDO విశాఖపట్నంలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
రైల్వే RITES ఉద్యోగాలకు నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసాక ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, Apply లింక్స్ తో దరఖాస్తు చేసుకోవచ్చు.
రైల్వే RITES నుండి విడుదలయిన ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
