DRDO Notification 2025 :
బెంగళూరులోని డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజషన్ DRDO నుండి 25 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏరోనాటికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు 28th, 29th, 30th జనవరి 2025 న ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. BE, BTECH లో పలు ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలతోపాటు GATE 2023, 2024 స్కోర్ కలిగినవారికి అవకాశం ఉంటుంది. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
DRDO ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో 28th, 29th, 30th జనవరి 2025 న ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్లికేషన్ ఫారం, డాక్యుమెంట్స్ తో ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ముందుగా అభ్యర్థులు 24th జనవరి తేదీలోగా అప్లికేషన్, డాక్యుమెంట్స్ ని jrf.rectt.cabs@gov.in కి మెయిల్ చెయ్యాలి.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
DRDO నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు సంబందించి 25 ఖాళీలతో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంజనీరింగ్ విభాగాల్లో BE, BTECH ఏరోనాటికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
AP సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ లో 1,112 ఉద్యోగాలు : ఇంటర్ అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
DRDO పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాల మధ్యన వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాకు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయోపరిమితిలో సడలింపు ఉండాలి.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
DRDO సంస్థ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా జనవరి 28,29, 30 తేదీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులైనవారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
AP హై కోర్టులో క్లర్క్ ఉద్యోగాలు విడుదల : Apply
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹37,000/- శాలరితో పాటు HRA (హౌస్ రెంట్ అలవెన్స్) కూడా కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు:
అప్లికేషన్ చేసే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
గేట్ 2023, 2024 స్కోర్ కార్డు ఉండాలి.
అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ, కాస్ట్ సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణా గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
DRDO ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని Apply చెయ్యాలి.
Notification & Application Form
DRDO లో ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవాలి.
