AP Welfare Dept Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని హెల్త్ మెడికల్ & కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖలో 266 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలోని 4 జోన్లవారీగా ఖాళీలను విడుదల చేస్తూ ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా భర్తీ చేయడానికి పోస్టులు విడుదల చేయడం జరిగింది. Bsc నర్సింగ్ లేదా GNM నర్సింగ్ చేసిన అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నట్లయితే Apply చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
| అప్లికేషన్స్ సబ్మిట్ చేసే తేదీలు | 1st జనవరి నుండి 15th జనవరి 2025 |
| అప్లికేషన్స్ Scrutiny చేసే తేదీలు | 17th జనవరి నుండి 23rd జనవరి 2025 |
| ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ | 24th జనవరి 2025 |
| ఆబ్జెక్షన్స్ తీసుకునే తేదీ | 25th జనవరి 2025 |
| ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ | 29th జనవరి 2025 |
| కౌన్సిలింగ్ నిర్వహించే తేదీ | 30th జనవరి 2025 నుండి 31st జనవరి 2025 |
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుండి 266 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. జోన్లు, జిల్లాలవారీగా ఖాళీలు ఉన్నాయి. BSC Nursing, GNM Nursing అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యాశాఖలో జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఉద్యోగాలు: ఇంటర్ అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
స్టాఫ్ నర్స్ పోస్టులకు జోన్లవారీగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగు ఇస్తారు.
ఏపీ జాబ్ క్యాలెండర్ 2025 విడుదల : 866 పోస్టులు
శాలరీ వివరాలు:
స్టాఫ్ నర్స్ లుగా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- శాలరీ చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
కావలిసిన సర్టిఫికెట్స్ వివరాలు:
10th క్లాస్ మార్క్స్ లిస్ట్, నర్సింగ్ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏపీలో 344 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్స్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
