RBI Notification 2024:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI నుండి 13 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలు కలిగినవారు 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన అప్లికేషన్ తేదీలు:
RBI నుండి విడుదలయిన జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ లో డిసెంబర్ 30, 2024 నుండి జనవరి 20, 2025 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 8,2025 న రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
RBI నుండి 13 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలు కలిగినవారు అర్హులు.
హైకోర్టులో కంప్యూటర్ అసిస్టెంట్ Govt జాబ్స్: ఇంటర్ అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
RBI నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు RBI డిపార్ట్మెంట్ వారు ఫిబ్రవరి 8th, 2025 న రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. పరీక్షలో అర్హత పొందినవారికి లాంగ్వేజ్ ప్రాఫిషయన్సీ టెస్ట్ పెట్టి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ఇస్తారు.
ఫుడ్ స్టాండర్డ్స్ Dept లో ఉద్యోగాలు : No Exam
శాలరీ వివరాలు:
RBI జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹65,000/- శాలరీ చెల్లిస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
దరఖాస్తు ఆన్లైన్ లో సబ్మిట్ చేసే అభ్యర్థులలో SC, ST, PWD అభ్యర్థులు ₹50/- ఫీజు, UR, OBC EWS అభ్యర్థులు ₹450/- ఫీజు చెల్లించాలి.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
RBI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
డిప్లొమా అర్హత సర్టిఫికెట్స్
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
ఏపీ సివిల్ సప్లయ్స్ Dept నోటిఫికేషన్ : 850+ జాబ్స్
ఎలా Apply చెయ్యాలి:
RBI ఉద్యోగాల సమాచారం చూసిన తర్వాత ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
