AP Revenue Dept Notification 2024:
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నుండి శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజను పరిధిలోని 59 రేషన్ డీలర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నందున, వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:
59 రేషన్ డీలర్స్ ఉద్యోగాలకు ఈ క్రింద తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
| అప్లికేషన్ ప్రారంభ తేదీ | 26th డిసెంబర్ 2024 |
| అప్లికేషన్ ఆఖరు తేదీ | 9th జనవరి 2025 |
| హాల్ టికెట్స్ విడుదల తేదీ | 17th జనవరి 2025 |
| రాత పరీక్ష నిర్వహించే తేదీ | 19th జనవరి 2025 |
| Exam రిజల్ట్స్ విడుదల తేదీ | 23rd జనవరి 2025 |
| ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ | 27th జనవరి 2025 |
| ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ | 30th జనవరి 2025 |
పోస్టుల వివరాలు-అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి డివిజను పరిధిలోని 59 రేషన్ డీలర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నందున, వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సికింద్రాబాద్ రైల్వే లో 4,232 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల:10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
రేషన్ డీలర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు గురించి నోటిఫికేషన్ లో వివరాలు తెలుపలేదు.
సెలక్షన్ ప్రాసెస్ :
డీలర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 19న రాత పరీక్ష నిర్వహించడం ద్వారా అర్హత పొందినవారికి జనవరి 27న ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్ష 80 మార్కులకు, ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది.
ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు: No Exam
శాలరీ వివరాలు:
రేషన్ డీలర్స్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు ఎటువంటి శాలరీలు ఉండవు. వారికి కమిషన్ విధానంలో డబ్బులు వస్తాయి. గరిష్టంగా నెలకు ₹25,000/- వరకు సంపాదించుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు:
రేషన్ డీలర్స్ ఎంపిక ప్రక్రియ కొరకు అభ్యర్థులు ₹600/- ఫీజు చెల్లించాలి. అన్ని కేటగిరీలవారు ఫీడు పే చెయ్యాలి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
రేషన్ డీలర్స్ ఉద్యోగాలకు Apply చెయ్యాలంటే ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
10+2 అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్థానికత తెలిపే రెసిడెన్సీ సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్ను, నోటిఫికేషన్ ను మండల రెవిన్యూ అధికారి కార్యాలయం నుండి తీసుకొని పూర్తి చేసి గడువులోగా సబ్మిట్ చెయ్యాలి.
Ration Dealer Jobs Apply Process
AP రేషన్ డీలర్స్ ఉద్యోగాలకు ఆ జిల్లా స్థానిక యువత దరఖాస్తు చేసుకోవాలి.
