TG TET 2025 June Exams Results Date : Check Details @tgtet.aptonline.in/tgtet

TG TET 2025 June Exams Results Date:

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TG TET 2025) జూన్ పరీక్షల ఫలితాలను జూలై 22, 2025 విడుదల చేయనున్నారు. ఈ పరీక్షను జూన్ 18 నుండి 30వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల యొక్క ఆన్సర్ కి, రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి జూలై 5వ తేదీన అధికారిక వెబ్ సైట్ లో లింక్ యాక్టివేట్ చేశారు. ఆన్సర్ కి మరియు రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు జూలై 8వ తేదీ వరకు అబ్జెక్షన్ పెట్టుకునే విధంగా అవకాశం కల్పించారు. చాలామంది అభ్యర్థులు వారి యొక్క రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకొని అందులో తప్పుగా ఉన్న ప్రశ్నలకు అబ్జెక్షన్స్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మరో 12 రోజుల్లో ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు.

ఫలితాలు విడుదల తేదీ?:

Join WhatsApp Group

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 ఫలితాలను జూలై 22వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు గతంలోనే ప్రకటించారు. మొత్తం 1.4లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. పరీక్ష రాసిన అభ్యర్థులందరూ అదే రోజున ఫలితాలు డౌన్లోడ్ చేసుకొని వారికి ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి యొక్క మొబైల్ ఫోన్లోనే ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు.

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 జూన్ పరీక్షల యొక్క ఫలితాలను ఈ క్రింది విధానాన్ని అనుసరించడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.

పోస్టల్ జిడిఎస్ 2025 5th మెరిట్ లిస్టు ఫలితాలను విడుదల చేశారు : డౌన్లోడ్

  1. ముందుగా తెలంగాణ టెట్ 2025 అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” TG TET 2025 Results” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన అభ్యర్థుల యొక్క ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. వాటిని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

TG TET 2025 June results website

FAQ’s:

1. తెలంగాణ టెట్ 2025 జూన్ పరీక్షల యొక్క ప్రాథమిక ఆన్సర్ కి డౌన్లోడ్ తేదీ ముగిసిందా?

అవును. జూలై 8వ తేదీ వరకు ఆన్సర్ కీ లను డౌన్లోడ్ చేసుకొని అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసుకునే విధంగా అధికారులు అవకాశం ఇచ్చారు.

2. తెలంగాణ టెట్ 2025 జూన్ పరీక్షల యొక్క ఫలితాలను ఎప్పుడు విడుదల చేయనున్నారు?

జూలై 22, 2025వ తేదీన ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.

3. తెలంగాణ టెట్ 2025 ఫలితాలను చెక్ చేసుకునే అధికారిక వెబ్సైట్ ఏమిటి?

https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లో మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు