AP EAMCET 2025:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ జులై ఏడో తేదీ నుండి ప్రారంభమైన విషయం మీకు తెలిసిందే. అయితే, మొదటి విడతలో కాలేజీలను ఎంపిక చేసుకొని, సీట్ అలాట్మెంట్ పొందినటువంటి విద్యార్థులకు మొదటి సంవత్సర బీటెక్ తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనేటువంటి సందేహం నెలకొంది. AICTE ( All India Council for Technical Education) తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశంలోని అన్ని కాలేజీలు మరియు యూనివర్సిటీలు మొదటి సంవత్సర బీటెక్ తరగతులను ఆగస్టు 14వ తేదీలోగా ప్రారంభించాలని ఇటీవల నోటీసు జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో బీటెక్ మొదటి సంవత్సర తరగతులను ‘ ఆగస్టు 4వ తేదీన ‘ ప్రారంభించినట్లు ఏపీ ఉన్నత విద్యా మండలి అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లోని ఎంసెట్ కౌన్సిలింగ్ ని త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తోంది.
ఏపీలో BTECH మొదటి సంవత్సర తరగతులు ప్రారంభ తేదీ?:
- ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ బీటెక్ మొదటి సంవత్సర తరగతులను ఆగస్టు 4, 2025 నుండి ప్రారంభించనున్నారు.
- దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వారు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ ఎంసెట్ 2025 మొదటి విడత కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు:
ఏపీ ఎంసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
TG TET 2025 ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ
- రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ : జులై 7, 2025
- రిజిస్ట్రేషన్ ఆఖరి తేదీ : జూలై 16, 2025
- సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీలు : జూలై 7 నుండి 17వ తేదీ వరకు
- వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసే తేదీలు : జూలై 13 నుండి 18 వరకు
- సీట్ అలాట్మెంట్ చేసే తేదీ : జూలై 22, 2025
- మొదటి సంవత్సర తరగతులు ప్రారంభమయ్యే తేదీ : ఆగస్టు 4, 2025
ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ కోసం కావలసిన సర్టిఫికెట్స్:
ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్కు హాజరు అయ్యే విద్యార్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
పోస్టల్ GDS 2025 5th మెరిట్ లిస్ట్ విడుదల
- ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్
- ఏపీ ఎంసెట్ 2025 ర్యాంక్ కార్డ్
- పదో తరగతి మార్క్స్ మెమో
- ఇంటర్ మార్క్స్ మెమో
- క్యాస్ట్ సర్టిఫికెట్స్
- ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్
- రెసిడెన్స్ సర్టిఫికెట్స్
- స్టడీ సర్టిఫికెట్స్
- ఇతర ముఖ్యమైన ధ్రువపత్రాలు ఉండాలి.
రెండో విడత కౌన్సిలింగ్ ఎప్పుడు?:
మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే, రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. మొదటి విడుదల సీట్స్ రాని విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్ అప్లై చేసుకోవచ్చు.
