AP POLYCET 2025 Seat Allotment:
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 ఎంట్రన్స్ పరీక్షల్లో 1,33,358 విద్యార్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే వీరంతా జూలై ఆరో తేదీ వరకు ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని,దరఖాస్తులు సబ్మిట్ చేశారు. ఇప్పుడు వీరికి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ ఫలితాలను జూలై 9, 2025 న విడుదల చేయనున్నారు. మొదటి రెండు సీట్ అలాట్మెంట్ ఫలితాల్లో సీటు పొందిన విద్యార్థులు జూలై 10వ తేదీ నుండి 15వ తేదీ మధ్యన, వారికి వచ్చిన కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మరియు ఫీజు చెల్లించవలెనని అధికారులు తెలిపారు. ఏపీ పాలీసెట్ 2025 మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ లో ఏ విషయాలు ఉంటాయి. పూర్తి వివరాలు చూడండి.
ఏపీ పాలీసెట్ 2025 కౌన్సిలింగ్ ముఖ్యమైన తేదీలు:
| అంశము | తేదీలు |
| సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీ | జూన్ 20 నుండి జూలై 3, 2025 వరకు |
| వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసే తేదీ | జూన్ 30 నుండి జూలై 5, 2025 వరకు |
| వెబ్ ఆప్షన్స్ మార్చుకునే అవకాశం | జూలై 6, 2025 |
| మొదటి రౌండ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు | జూలై 9, 2025 |
| సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు ఫీజు చెల్లించే తేదీ | జూలై 10 – 15, 2025 వరకు |
ఏపీ పాలీసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల తేదీ?:
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 మొదటి విడత కౌన్సెలింగ్ కు దరఖాస్తులు చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న విద్యార్థుల యొక్క ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలను, జూలై 9, 2025వ తేదీన విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ యొక్క సీట్ అపార్ట్మెంట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలు
సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:
- ఏపీ పాలీసెట్ కౌన్సిలింగ్ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి Candidate Login లో Login అవ్వండి.
- విద్యార్థి యొక్క లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయండి.
- “1st Phase Seat Allotment Results 2025” ఆప్షన్ పై క్లిక్ చేయండి. స్క్రీన్ పైన సీట్ అలాట్మెంట్ కి సంబంధించిన PDF లేదా ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
- ఆ సీట్ అలాట్మెంట్ ఫలితంలో మీకు వచ్చిన కాలేజ్ మరియు బ్రాంచ్ వివరాలు ఉంటాయి. చెక్ చేసుకోండి.
- ఆ తర్వాత ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో ₹800/- ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు మీకు వచ్చిన కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ చేయండి.
AP POLYCET 2025 Seat Allotment Results
సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు ఫీజు చెల్లించే తేదీ:
- ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కాలేజీలో సీటు పొందిన విద్యార్థులు, జూలై 10 నుండి 15వ తేదీ వరకు సెల్ఫ్ రికార్డింగ్ చేయాలి.
- సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో విద్యార్థులు ఫీజు చెల్లించవలెను.
AP IIIT 2025 2nd Phase Cut Off Marks Campus Wise
FAQ’s:
1. ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల చేసే తేదీ ఏమిటి?.
జూలై 9, 2025 న ఫలితాలు విడుదల చేయమన్నారు.
2. ఏపీ పాలీసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి?.
https://polycet.ap.gov.in/ వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
