AP Mega DSC 2025 cutoff marks:
ఏపీ మెగా డీఎస్సీ 2025 పరీక్షలకు సంబంధించి 16,347 పోస్టులకు జూన్ 6 నుండి జూలై రెండవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ లను విద్యాశాఖ విడుదల చేసింది. ఆన్సర్ కీ లో మరియు రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు గడువులోగా అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసుకోవాలి. అయితే ప్రాథమిక ఆన్సర్ కీలు విడుదలైన తర్వాత, తమకు వచ్చిన మార్కులకు ఎంత కటాఫ్ ఉంటుంది?, ఎన్ని మార్కులు వస్తే జాబ్ వస్తుంది?, తెలుసుకోవడం కోసం అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. అయితే అందరికీ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమిటంటే, ఆన్సర్ కీ లో వచ్చినటువంటి మార్కుల ద్వారా వారికి జాబ్ వస్తుందా? లేదా?. ఈ నేపథ్యంలో మేము మీకోసం పోస్టుల సంఖ్య, పోటీ పడిన అభ్యర్థుల సంఖ్య, ప్రశ్నపత్రాల స్థాయి, అర్హత మార్కుల ఆధారంగా పోస్టుల వారీగా మరియు క్యాటగిరీల వారీగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ డేటాను ప్రిపేర్ చేయడం జరిగింది.
ఏపీ మెగా డిఎస్సి 2025: పోస్టుల వారీగా క్యాటగిరీల వారీగా Expected Cutoff Marks:
| పోస్ట్ పేరు | మొత్తం మార్కులు | General Category expected cut off marks | other categories expected cutoff marks |
| స్కూల్ అసిస్టెంట్ (SA) | 100 | 72-78 | BC: 66-70, SC/ST: 58–62 |
| సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) | 100 | 68-74 | BC: 60–66, SC/ST: 50–56 |
| ట్రైన్డ్ గ్రేట్ టీచర్ (TGT) | 100 | 70-76 | BC: 64–68, SC/ST: 56–60 |
| పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) | 100 | 74-80 | BC: 68–72, SC/ST: 60–64 |
| ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) | 100 | 65-70 | BC: 58–62, SC/ST: 50–54 |
| లాంగ్వేజ్ పండిట్ | 100 | 70-75 | BC: 62–66, SC/ST: 54–58 |
Expected Cut Off Marks అంచనా ఎలా చేశాము?:
అన్నదాత సుఖీభవ పథకం అర్హులు మరియు అనర్హుల జాబితా విడుదల : మీ పేరు చూసుకోండి
- పైన తెలిపిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్లను జూన్ లో జరిగిన డీఎస్సీ పరీక్షల ట్రెండ్ , ఈసారి వచ్చిన ప్రశ్న పత్రాల స్థాయి, పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్యను బట్టి అంచనా వేయడం జరిగింది
- అధికారిక కటాఫ్ మార్క్స్ మాత్రం ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల ఏ సమయంలో మాత్రమే విడుదల చేస్తారు
- ఈ కట్ ఆఫ్ మార్కులు ప్రధానంగా జనరల్ కేటగిరి తో పాటు ఇతర కేటగిరీలకు సంబంధించిన అభ్యర్థులకు కూడా అంచనా వేయడం జరిగింది.
అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు?
ఏపీ తల్లికి వందనం పథకం జాబితా అధికారిక ఫైనల్ లిస్ట్ వచ్చేసింది : మీ పేరు చెక్ చేసుకోండి
- అభ్యర్థులు ప్రాథమిక ఆన్సర్ కి చూసుకున్న తర్వాత మీకు వచ్చినటువంటి మార్కులు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులు కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉన్నట్లు అర్థం.
- ఆన్సర్ కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే సంబంధిత వెబ్సైట్ ద్వారా వెంటనే అబ్జెక్షన్ సబ్మిట్ చేయండి. మీకు మార్కులు కలుస్తాయి.
- ప్రాథమిక ఆన్సర్, అభ్యంతరాలు సబ్మిషన్, తుది ఆన్సర్ కి, ఫైనల్ రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
చాలా సంవత్సరాల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలడం వల్ల ఈసారి పోటీ ఎక్కువగా ఉంది. అయినా కూడా మెరిట్ మార్కులు ఆధారంగానే ఎంపిక చేస్తారు. అందుచేత మీరు సాధించిన మార్పుల ఆధారంగా, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్కులను సరిచూసుకొని మీకు జాబ్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి.
