అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితా విడుదల చేశారు: మీ పేరు చెక్ చేయండి, పేరు లేని వారు 10వ తేదీలోగా ఇలా ఫిర్యాదు చేయండి

Annadatha sukhibhava scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం జూలై నెలలో ప్రారంభించబోయే ” అన్నదాత సుఖీభవ పథకం 2025 ( annadatha sukhibhava scheme 2025) కు సంబంధించి కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ పథకానికి మీరు అర్హులా కాదా చెక్ చేసుకోవడానికి అధికారికి వెబ్సైట్లో స్టేటస్ లింక్ యాక్టివేట్ చేశారు. ఆ లింకు ఓపెన్ చేసి రైతు యొక్క ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి, ఈ పథకానికి మీరు అర్హులా కాదా అని చెక్ చేసుకోవచ్చు. అర్హులు కాని వారు జూన్ 10వ తేదీలోగా దగ్గర్లోని రైతు సేవా కేంద్రంలో ఉన్న సిబ్బందికి ఫిర్యాదులు చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నట్లు వ్యవసాయ డైరెక్టర్ సూచించారు. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి, అర్హత లేని వారు ఫిర్యాదులు ఎలా చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

అన్నదాత సుఖీభవ పథకానికి మీరు అర్హులా? కాదా? ఎలా చూసుకోవాలి?:

అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి

Join WhatsApp group

మొహరం పండుగ సందర్భంగా ఏపీ తెలంగాణలో సోమవారం నాడు సెలవు ఉందా లేదా?: వెంటనే చూడండి

  1. ముందుగా అన్నదాత సుఖీభవ ( Annadata sukhibhava website) వెబ్సైట్లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” know your status ” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
  3. లబ్ధిదారుల యొక్క 12 అంకెల” Aadhar card number” ఎంటర్ చేయండి
  4. పక్కనే ఉన్న క్యాప్చ కోడ్ కూడా ఎంటర్ చేసి, సబ్మిట్ చేసిన వెంటనే
  5. స్క్రీన్ పైన లబ్ధిదారుని పేరు,గ్రామం,మండలం,స్టేటస్,eKYC పూర్తి అయిందా లేదా అనేటువంటి పూర్తి వివరాలు చూపిస్తుంది.
  6. స్టేటస్ లో ‘ eligible” అని ఉంటే ఈ పథకానికి వారు అర్హులు అని అర్థం
  7. స్టేటస్ లో ‘ ineligible” అని ఉంటే ఈ పథకానికి వారు అర్హులు కాదు అని అర్థం.

అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత లేని వారు ఫిర్యాదులు ఎలా సబ్మిట్ చేయాలి?:

అన్నదాత సుఖీభవ పథకం అధికారిక వెబ్సైట్లో స్టేటస్ చెక్ చేసుకున్నాక, మీరు ఈ పథకానికి అర్హులు కాదు అని చూపించినట్లయితే ఈ క్రింది విధంగా మీరుఫిర్యాదులు చేసుకోవాలి.

తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా ఫైనల్ లిస్ట్ వచ్చేసింది : మీ పేరు చూసుకోండి

  • అర్హత లేని రైతు సోదరులు ” మీ దగ్గరలోని రైతు సేవ కేంద్రానికి వెళ్లి ” సంబంధిత సిబ్బంది వారికి ఫిర్యాదులు సమర్పించాలి.
  • ఫిర్యాదు చేసే సమయంలో లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డ్ నెంబర్,
  • eKYC వివరాలు, భూమి యొక్క పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీలు,
  • ఇతర కావలసిన వివరాలన్నీ సబ్మిట్ చేసి,
  • తాము ఈ పథకానికి అర్హులమని, అక్కడ ఉన్న సిబ్బందికి తెలియజేసి, వారికి కూడా అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు డిపాజిట్ అయ్యేలాగా ఫిర్యాదు చేయాలి.

Anuradha sukhibhava scheme 2025 : official website

ఫిర్యాదులు చేసేందుకు ఆఖరి తేదీ ఏమిటి?

అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్న అర్హత లేదు అని వెబ్సైట్లో స్టేటస్ ఉన్న లబ్ధిదారులు ఫిర్యాదులు సమర్పించినందుకు జూన్ 10వ తేదీ వరకు మాత్రమే సమయం ఇచ్చారు. ఆ తేదీలోగా మీరు ఫిర్యాదులను సంబంధిత రైతు సేవ కేంద్రంలోని అధికారులకు సబ్మిట్ చేయవలెను.

అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఎప్పుడు డిపాజిట్ చేస్తారు?:

అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన లబ్ధిదారుల రైతుల అకౌంట్లో మొదటి విడతగా ₹7,000/- ఈ జూలై నెలలోనే డిపాజిట్ చేస్తారు. ఇందులో పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 5000 రూపాయలు, మొత్తం కలిపి రైతుల ఖాతాలో ₹7000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది.