AP DSC Results 2025: Check Official Dates @Freejobsintelugu.com

AP DSC 2025 Results:

ఏపీ మెగాడిఎస్సి 2025 పరీక్షలో నిన్నటితో విజయవంతంగా పూర్తయ్యాయి. మొత్తం 16 వేలకు పైగా ఉన్నటువంటి డీఎస్సీ పోస్టులను భర్తీ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ జూన్ ఆరో తేదీ నుండి జూలై 2వ తేదీ వరకు రోజుకి రెండు విడతల వారీగా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఏపీ మెగా డీఎస్సీ ఉద్యోగాలకు 3,60,000+ అభ్యర్థులు 5,50,000పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో SGT, TGT, PGT, PET, ఇతర టీచర్ పోస్టులు ఉన్నాయి. యోగాంధ్ర కారణంగా జూన్ 20 మరియు 21వ తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసి, జూలై 1 మరియు 2వ తేదీల్లో నిర్వహించారు. అయితే ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయడానికి ముందు అన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను, ఈ వారంలో విడుదల చేసి, అభ్యంతరాలు పెట్టుకున్న తర్వాత ఫైనల్ కీ అలాగే ఫైనల్ రిజల్ట్స్ ని ఆగస్టు మొదటి వారం లేదా రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని తరచూ విజిట్ చేస్తూ ఉండండి.

AP DSC 2025 Results Expected Date:

ఏపీ మెగాడిఎస్సి 2025 ఫలితాలను ఆగస్టు మొదటి వారం లేదా రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం .ముందుగా ప్రాథమిక కీలను ఈ వారంలో విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీలో తప్పులు ఉన్నట్లయితే వాటికి అభ్యంతరాలు పెట్టుకోవడానికి కొంత సమయం కేటాయిస్తారు. అధికారులు అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత, ఫైనల్ కీ అలాగే ఫైనల్ రిజల్ట్స్ ని ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉంది.

Join WhatsApp group

How To Check AP DSC 2025 Results:

ఏపీ మెగాడీఎస్సి 2025 ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

ఏపీ తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బులు డిపాజిట్ వాయిదా : కొత్త తేదీ ప్రకటన

  1. ముందుగా ఏపీ మెగా DSC అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోం పేజీలో “AP DSC Results 2025” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ డేట్, అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. వెంటనే స్క్రీన్ పైన విద్యార్థుల యొక్క ఫలితం చూపిస్తుంది, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి.
  5. జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ మరియు ర్యాంక్ కార్డులు విడుదల అయ్యే అవకాశం ఉంది.

AP DSC 2025 Official Website

అన్నదాత సుఖీభవ పథకం “Status Check” లింక్ ఇచ్చారు : మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా చూడండి

FAQ’s:

1. ఏపీ మెగాడీఎస్సీ 2025 ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?

ఆగస్టు మొదటి వారం లేదా రెండవ వారంలో ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి

2. ఏపీ మెగా డీఎస్సీ 2025 మొత్తం ఉద్యోగ ఖాళీలు ఎన్ని?

మొత్తం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు

3. ఏపీ మెగా DSC 2025 ప్రాథమిక ఆన్సర్ కి ఎప్పుడు విడుదల చేస్తారు?

ఈ వారంలోనే అన్ని పరీక్షల యొక్క ప్రాథమిక కీలను అధికారిక వెబ్సైట్లో ఉంచుతారు.