AP Annadhatha Sukhibhava Scheme 2025 Status Check Official: మీరు Eligible? కాదా చెక్ చేసుకోండి

AP Annadhatha Sukhibhava Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటయినటువంటి ” అన్నదాత సుఖీభవ” పథకాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెలలోనే రైతుల అకౌంట్లో పీఎం కిసాన్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే మొదటి విడత డబ్బులు కూడా కలిపిమొత్తం ₹7,000/- రైతుల ఖాతాల్లో నేరుగా డిపాజిట్ చేయనుంది. అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తులు చేసుకున్న రైతులు వారు ఈ పథకానికి అర్హులా కాదా తెలుసుకోవడానికి, అధికారికి వెబ్సైట్లో Status లింక్ ఆక్టివేట్ చేయడం జరిగింది. స్టేటస్ లో మీ యొక్క eKYC ప్రాసెస్ పూర్తి చేశారా లేదా అలాగే మీరు ఈ పథకానికి ELIGIBLE అయ్యారా లేదా అనే విషయాలను తెలుసుకుని వెసులుబాటు కల్పించారు. రైతులు వారి యొక్క ఆధార్ కార్డు వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేసిన వెంటనే స్క్రీన్ పైన స్టేటస్ చూపిస్తుంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా మీ eKYC పూర్తి అయ్యిందా లేదా అనేటువంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

మొత్తం ఎన్ని విడతల్లో ఎంత డబ్బు డిపాజిట్ చేస్తారు?:

అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులను మొత్తం మూడు విడుదల రైతుల ఖాతాలో నేరుగా డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

Join WhatsApp group

  • మొదటి విడత : ₹7,000/- డబ్బులు జమ : జూలై, 2025
  • రెండవ విడత: ₹7,000/- డబ్బులు జమ : నవంబర్, 2025
  • మూడవ విడత : ₹6,000/- డబ్బులు జమ : జనవరి, 2026

ఇలా మూడు విడతల్లో మొత్తం ₹20,000/- రైతులు అకౌంట్లో నేరుగా ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది.

Status ఎలా చెక్ చేసుకోవాలి?:

అన్నదాత సుఖీభవ 2025 పథకానికి మీరు అర్హులా? కాదా? తెలుసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.

  1. ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్ (Annadhatha Sukhibhava Website) ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో “Know Your Staus” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. క్లిక్ చేసిన ఓపెన్ కాకపోతే, వెబ్ సైట్ ని “Refresh” చేసి మళ్ళీ “Know Your Status” లింక్ పై క్లిక్ చేయండి
  4. లబ్ధిదారుని యొక్క 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, పక్కనే ఉన్న Capcha Code ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  5. వెంటనే స్క్రీన్ పైన లబ్ధిదారుని పేరు, లబ్ధిదారుని మండలం, గ్రామం పేరు, Eligible, eKYC Completed వంటి పూర్తి వివరాలు స్క్రీన్ పైన చూపిస్తాయి.
  6. Eligible” అని వచ్చినట్లయితే, ఆ రైతు ఖాతాలోఅన్నదాత సుఖీభవ పథకం డబ్బులు డిపాజిట్ అవుతాయి.
  7. Ineligible అని చూపిస్తే, మీ దగ్గరలోని గ్రామ సచివాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకుని మళ్లీ అప్లై చేయండి.

Annadhatha Sukhibhava Status Check Website

తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా విడుదల చేశారు : మీ పేరు చెక్ చేసుకోండి

eKYC ఎలా చేసుకోవాలి?:

అన్నదాత సుఖీభవ పథకానికి eKYC ప్రక్రియని ఈ క్రింది విధంగా నమోదు చేయండి

  • ముందుగా అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి
  • eKYC అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • లబ్ధిదారుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి
  • OTP ద్వారా వెరిఫై చేయండి
  • స్క్రీన్ పైన eKYC Successful అని చూపిస్తుంది.

పైన తెలిపిన విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా మీ eKYC పూర్తి అయ్యిందా లేదా అనేటువంటి వివరాలు తెలుసుకోవచ్చు.