Indian Postal Franchise Outlet Scheme 2025:
ఈరోజుల్లో ప్రభుత్వ రంగంతో అనుబంధంగా చిన్న వ్యాపారం మొదలుపెట్టాలి అనుకునే వారికి ” ఇండియా పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ స్కీం 2025 ” ఒక మంచి అవకాశాన్ని అందిస్తోంది. మీ దగ్గర ఒక చిన్న షాప్ లేదా ఒక చిన్న గది ఉంటే సరిపోతుంది. మీరు కూడా పోస్ట్ ఆఫీస్ సేవలు అందించా ఒక అధికారిగా మారిపోతారు. ఇది ఒక ఉద్యోగం కాదు ఇది ఒక వ్యాపారంలా చేసే మంచి అవకాశం. కానీ ప్రభుత్వ సేవలకు ఒక బ్రాంచ్ లా పనిచేసే ఒక చిన్న ఆఫీసులో మారుతుంది మీ పోస్టల్ ఆఫీస్ ఫ్రాంచైజ్ ఔట్లెట్. ఇప్పుడు ఈ స్కీం కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ ఎందుకు ఫ్రాంచైజీలకు అవకాశం ఇస్తుంది?:
భారతదేశ పోస్టల్ వ్యవస్థ చాలా విస్తృతమైనది అయినప్పటికీ కూడా, కొన్ని గ్రామాలు మరియు పట్టణాల వైపు ఇంకా పోస్టల్ సేవలు పూర్తిగా చేరలేదు.అలాంటి ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడికి చేరువ ఏ విధంగా అక్కడ అందుబాటులో ఉన్న వ్యాపారులను భాగస్వాములుగా తీసుకోవడమే ఈ ఫ్రాంచైజీ ఉద్దేశం.
పోస్టల్ ఫ్రాంచైజీ ద్వారా అందించే సేవలు ఇవే :
- స్పీడ్ పోస్ట్ మరియు రిజిస్టర్ పోస్టులను బుక్ చేయడం
- స్టాంపులు మరియు పోస్టల్ స్టేషనరీ విక్రయించడం
- మనీ ఆర్డర్స్ చేయడం
- పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కలెక్షన్ చేయడం
- ఇ – గవర్నెన్స్ సేవలు, బిల్లుల చెల్లింపులు వంటి ఇతర సర్వీసెస్ అందించవచ్చు.
TS IIIT బాసర 2025 ఫలితాలు విడుదల తేదీ
మీకు ఆదాయం ఎలా వస్తుంది?:
ఈ ఫ్రాంచైజీ ద్వారా మీరు అందించే ప్రతి సేవలకు కమిషన్ రూపంలో ఆదాయం వస్తుంది.
- స్పీడ్ పోస్ట్ లకు సెవెన్ పర్సెంట్ నుంచి 25% వరకు
- మనీ ఆర్డర్లకు ₹3 రూపాయల నుంచి ₹5 రూపాయల వరకు
- స్టాంపులపై 5% శాతం వరకు లాభం
- కొన్ని ప్రాంతాల్లో నెలకు ₹15,000/- నుండి ₹40,000/- రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.
ఈ ఫ్రాంచైజీని మీరు ఓపెన్ చేయడానికి కావలసినవి:
- అర్హత : 8వ తరగతి /10వ తరగతి
- వయస్సు : 18 సంవత్సరాలు పైబడినవారు అర్హులు.
- కనీసం 100 Sq.ft స్థలం ఉండాలి.
- ₹5,000/- నుండి ₹10,000/- వరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి
- బేసిక్ కంప్యూటర్ లేదా మొబైల్ నాలెడ్జి ఉండాలి.
- 18 ఏళ్ల వయస్సు పైబడి ఉండాలి.
ఏపీ తెలంగాణ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ప్రారంభమయ్యే తేదీ వచ్చేసింది
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:
మీ ఇంటి వద్దనే పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజీని ఓపెన్ చేయడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి
- https://www.indiapost.gov.in/ నుండి దరఖాస్తు ఫారంని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ జిల్లా పోస్టల్ డివిజనల్ కార్యాలయంలో ఆ దరఖాస్తుని సమర్పించండి.
- స్థలం పరిశీలన, ఇంటర్వ్యూ తర్వాత MOU ( Memorandum of understanding ) తో ఫ్రాంచైజీ మంజూరు అవుతుంది.
- ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత మీరు మీ ఇంటి వద్దనే పోస్టల్ సేవలు అందించవచ్చు.
Notification & Application Form
మీ దగ్గర చిన్న వ్యాపారం లేదా ఖాళీ షాప్ ఉన్నట్లయితే దీన్ని సంపూర్ణ ప్రభుత్వ సేవల కేంద్రంగా మార్చుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో నెలకు స్థిర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగం అయితే కాదు కానీ ఉద్యోగం లాంటి భద్రత కలిగినటువంటి ఒక వ్యాపారం. అది కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ తో అనుబంధంగా కలిసి పనిచేసే అవకాశం.
