AP DSC 2025 మరికొన్ని పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేశారు: వెంటనే డౌన్లోడ్ చేసుకోండి

AP DSC Answer Key 2025:

ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ 2025 పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు ఎదురుచూస్తున్న మరో ముఖ్యమైన అప్డేట్ అధికారికంగా రావడం జరిగింది. జూన్ 14న జరిగిన పిజిటి ఇంగ్లీష్ మీడియం, జూన్ 17న జరిగిన జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ మీడియం పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు మరియు కీ రెస్పాన్స్ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగిందని డీఎస్సీ పరీక్షల నిర్వహణ అధికారులు తెలిపారు. ప్రాథమిక కీ సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

రెస్పాన్స్ షీట్స్ ఎప్పటినుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు?:

Join Whats App Group

  • పిజిటి మరియు జూనియర్ లెక్చరర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు జూన్ 23 సోమవారం నుండి రెస్పాన్స్ షీట్స్ ని అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు వారి యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేటాఫ్ బర్త్ తో పాటు ఇతర వివరాలను కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వడం ద్వారా రెస్పాన్స్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకొని కీ ని వెరిఫై చేసుకోవచ్చు.

ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఎలా సబ్మిట్ చేయాలి?:

  • ప్రాథమిక కీపై అభ్యంతరాలను అభ్యర్థులు జూన్ 29వ తేదీలోగా అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి, ప్రాపర్ డాక్యుమెంట్స్ తో ప్రాపర్ ఫార్మేట్ లో అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసినట్లయితే, కరెక్ట్ గా అభ్యంతరాలు తెలిపిన వారికి ఒక మార్కు ప్రతి ప్రశ్నకు కలపడం జరుగుతుంది.

AP RGUKT IIIT 2025 మెరిట్ లిస్ట్ విడుదల

కట్ ఆఫ్ మార్కులు ఎప్పుడు విడుదల చేస్తారు?:

  • ప్రాథమిక కీ ప్రక్రియ పూర్తయిన తర్వాత DSC 2025 పరీక్షల కోసం కట్ ఆఫ్ మార్కులు అని విడుదల చేసే అవకాశం ఉంది.
  • ఫైనల్ రిజల్ట్స్ ని విడుదల చేయడానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో వెలువబడుతుంది.

ప్రాథమిక కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

అభ్యర్థులు కి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో మీ వివరాలతో లాగిన్ అవ్వండి
  3. అక్కడ ” AP DSC 2025 preliminary answer key” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  4. మీరు రాసిన పరీక్షలకు సంబంధించినటువంటి ప్రాథమిక కి డౌన్లోడ్ అవుతుంది
  5. కిలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ పెట్టుకోండి
  6. మీకు ప్రతి ప్రశ్నకు ఒక మార్పు కలిసే అవకాశం ఉంటుంది.

AP DSC official Website

ఈసారి ప్రశ్నపత్రాలను మరియు రెస్పాన్స్ షీట్లను ముందుగానే అప్లోడ్ చేయడం వల్ల అభ్యర్థులకు ఫలితాలపై స్పష్టత పెరుగుతుంది.ఏ అభ్యర్థి ఏ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడో తెలుసుకునే అవకాశం ఉంటుంది.