AP Thalliki Vandanam Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకాన్ని (Thalliki Vandanam Scheme 2025) అధికారికంగా ప్రారంభించింది. అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో ₹15,000/- జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ₹8,745/- కోట్లు జమ చేయనున్నారు. పిల్లల విద్యను ప్రోత్సహించే ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. స్కూలుకి పంపించే తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు, ప్రతి పిల్లవాడికి ₹15,000/- చొప్పున తల్లి యొక్క బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఏమైనా సాంకేతిక కారణాలవల్ల ఎవరికైనా ఈ పథకం అమలు కాకపోతే, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ డబ్బులు జమ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అవునా కొత్తవారు కూడా ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చు.
తల్లికి వందనం పథకం (Thalliki Vandanam Scheme 2025) అర్హతలు :
ఆంధ్రప్రదేశ్లోని తల్లికి వందనం పథకం డబ్బులు అకౌంట్ లో డిపాజిట్ అవ్వాలి అంటే ఈ క్రింది అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
- విద్యార్థి తప్పనిసరిగా ప్రభుత్వ / మున్సిపల్ జడ్పీ ఆశ్రిత అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న వారై ఉండాలి.
- విద్యార్థికి 75% అటెండెన్స్ ఉండాలి.
- తల్లి పేరుపై బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలి.
- తల్లి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం ₹1.2 లక్షల లోపు ఉండాలి.
- విద్యార్థి విద్యా సంవత్సరంలో మధ్యలో డ్రాప్ అవుట్ అయి ఉండకూడదు
కావలసిన సర్టిఫికెట్స్ వివరాలు:
తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
తల్లికి వందనం డబ్బులు జమ: పేరు ఉందేమో చూసుకోండి
- తల్లి యొక్క ఆధార్ కార్డు
- విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్
- తల్లి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా
- రెసిడెన్సి సర్టిఫికెట్ ఉండాలి
- ఇన్కమ్ లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం
- తల్లి యొక్క బ్యాంకు ఖాతా ఆధార్ తో లింక్ అయి ఉండాలి.
- విద్యార్థి యొక్క స్కూల్ అటెండెన్స్ సర్టిఫికెట్ ఉండాలి
కొత్తగా దరఖాస్తు చేసుకునే విధానం:
పథకం ప్రారంభించే రోజు జూన్ 12న లేదా తర్వాత అయినా మీకు డబ్బులు జమ కావాలి అంటే కొత్తగా ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోండి.
ఏపీ ఎంసెట్ 20025 ఇంటర్ మార్కులను వెంటనే అప్లోడ్ చేయండి
- అర్హులైన తల్లి దగ్గర్లోని గ్రామా లేదా వార్డు సచివాలయం లేదా మండల విద్యాధికారి కార్యాలయం నుండి దరఖాస్తు పత్రం తెచ్చుకోవాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి
- వాలిడేషన్ తర్వాత లబ్ధిదారుడిగా గుర్తించి, ఆ తల్లి ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.
- లబ్ధిదారులు మీ సేవ కేంద్రం ద్వారాగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
- త్వరితగతిని ప్రక్రియ పూర్తవ్వాలంటే గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించండి.
ముఖ్యమైన తేదీలు:
- పెళ్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన ప్రారంభించారు
- పాత దరఖాస్తుదారులకు ఇప్పటికే డబ్బులు జమ కావడం జరిగింది.
- డబ్బులు జమ అయిన వారికి ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ వస్తుంది.
- లబ్ధిదారులు గ్రామ వార్డు సచివాలయంలో స్టేటస్ కూడా చూసుకోవచ్చు.
- కొత్త దరఖాస్తుల ప్రక్రియ జూన్ 12వ తేదీ నుండి ప్రారంభమవుతుంది.
ఏపీ ఎంసెట్ 2025 10,000 లోపు ర్యాంకులు వచ్చినవారికి కాలేజీల వివరాలు
ముఖ్యమైన సమాచారం :
- గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం 24.65 లక్షల మంది తల్లులకు అదనంగా ఈ పథకం అమలు చేస్తుంది.
- కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం అమలు కానీ లబ్ధిదారులు,కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ఈ పథకాన్ని వెంటనే అమలు చేయడం జరుగుతుంది.
- కొత్తవారికి డబ్బులు జమకాని పక్షంలో అధికారులకు రిపోర్ట్ చేసి వెంటనే దరఖాస్తు చేస్తే, వెంటనే వారికి అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అయ్యే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
