ఏపీలో తల్లికి వందనం పథకంలాగానే మహిళలకు మరో పథకం: మహిళల అకౌంట్లో ₹15,000/- ఆర్థిక సహాయం: కావలసిన అర్హతలు, ఎలా అప్లై చేయాలి?

తల్లికి వందనం కాదు.. ఏపీలో మహిళలకు మరో పథకం :

ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఆర్థికంగా సహాయం చేసి వారు ఆర్థికంగా నెలకొకకునే విధంగా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ లోని “కాపు మహిళలకు” ₹15,000/- ఆర్థిక సహాయం అందించే విధంగా “గృహిణి” అనే పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకానికి కాపు కులానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులు. అయితే ఆ మహిళలు దరఖాస్తు చేసుకోవాలంటే వారికి ఉండవలసిన అర్హతలు, సర్టిఫికెట్ల వివరాలు, అలాగే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

AP Gruhini Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయమే లక్ష్యంగా తీసుకొని కాపు కులానికి చెందినటువంటి మహిళల కోసం” గృహిణి ” అనే పథకాన్ని 2025 లో ప్రారంభించనుంది.ఇప్పటికే తల్లికి వందనం పేరుతో రాష్ట్రంలోని పిల్లలను స్కూల్స్ కి పంపించేటువంటి తల్లుల ఎకౌంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు, ప్రతి పిల్లాడికి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తుంది. తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన ప్రారంభించనున్నారు. ఇప్పుడు కాపు మహిళల కోసం మరొక పధకాన్ని రూపొందించారు.

Join Whats App Group

ఈ పథకానికి ఎవరు అర్హులు:

  • దరఖాస్తు చేసుకునే మహిళలు కాపు కులానికి చెందిన వారై ఉండాలి
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి మహిళ అయి ఉండాలి.
  • వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిమితికి లోబడి ఉండాలి
  • ఇప్పటికే తల్లికి వందనం పథకానికి అర్హులైనటువంటి మహిళలు కూడా ఈ అర్హులు కావచ్చు( ఇంకా ప్రభుత్వం నుండి స్పష్టత రావాల్సి ఉంది ).

కావలసిన డాక్యుమెంట్స్:

గృహిణి పథకానికి కాపు కులానికి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది సర్టిఫికెట్లు కావలెను.

  • దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్
  • కాపు కమ్యూనిటీ సర్టిఫికెట్
  • బ్యాంకు ఖాతా వివరాలు
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
  • ఆదాయ ధ్రువీకరణ పత్రం

దరఖాస్తు విధానం:

ఈ గృహిణి అనే పథకం ప్రస్తుతం ఇంకా ప్రారంభించబడలేదు. త్వరలోనే అధికారిక వెబ్సైట్ లేదా నవరత్నాల వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది.

తల్లికి వందనం పథకం విడుదల తేదీ వచ్చేసింది:Click Here

ప్రాథమిక అంచనా ప్రకారం దరఖాస్తు ప్రక్రియ:

  • ఆన్లైన్ దరఖాస్తు: అధికారిక వెబ్సైట్లో చేయాలి (వెబ్సైటు ఇంకా ఆక్టివ్ చేయలేదు )
  • కావలసిన సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి
  • సచివాలయం ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ
  • అర్హులైన మహిళలకు బ్యాంకు ఖాతా ద్వారా నిధులు జమ చేస్తారు.

పథకం ప్రారంభ తేదీ & ప్రభుత్వ ప్రకటన:

ఈ పథకం గురించి ఇప్పటికే కొన్ని అధికారిక న్యూస్ వెబ్సైట్లలో వార్తలు వచ్చినప్పటికీ ప్రభుత్వము నుండి అధికారిక ప్రకటన వెలువడలేదు. జూన్ లేదా జూలై 2025 నాటికి అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

తల్లికి వందనం vs గృహిణి పథకం: తేడా ఏమిటి?:

అంశము తల్లికి వందనం పథకం గృహిణి పథకం
లబ్ధిదారులు పిల్లలను స్కూల్ కి పంపే తల్లులు కాపు కులం యొక్క
సహాయం రకం ప్రతి బిడ్డకు ₹15000/- ఆర్థికంగా వెనుకబడిన గృహిణులకు
మొత్తం చెల్లించే సహాయం₹15,000/-₹15,000/-

ముఖ్యమైన సూచనలు:

  1. ఈ పథకం అధికారికంగా ప్రకటించాక మాత్రమే ప్రారంభించడం జరుగుతుంది.
  2. తప్పనిసరిగా అధికారిక వెబ్సైట్ని మాత్రమే వాడండి మోసపూరితమైనటువంటి వెబ్సైట్స్ ని నమ్మకండి.
  3. సంబంధించిన అధికారిక గవర్నమెంట్ ఆర్డర్ GO, అప్లికేషన్ లింక్, ఆఖరి తేదీ వంటి పూర్తి వివరాలు కోసం మా వెబ్సైట్ ని సందర్శించండి.