AP 10th Supplementary Exams 2025 Results Released Date: Check Results @www.bse.ap.gov.in/

AP 10th Supplementary Exams 2025:

ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. కొన్ని వేల మంది ఈ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు ఫీజులు చెల్లించి పరీక్షలకు హాజరు కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. రాష్ట్రంలో కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు తెలిపారు. అయితే ఈ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించినటువంటి ఫలితాలను మే మూడో వారంలో, అనగా జూన్ 14వ తేదీ నుండి 17వ తేదీ మధ్యన విడుదల చేయడానికి అవకాశం ఉన్నట్లు అధికారులు తెలపడం జరిగింది. ఈ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా డిప్లమా కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉంది కాబట్టి, ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

ఏపీ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎప్పుడు?

ఏపీ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మే మూడో వారంలో అంటే జూన్ 14వ తేదీ నుండి జూన్ 17వ తేదీ మధ్యన విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే మే 28వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రభుత్వం ప్రారంభించింది.

Join What’s App Group

How to check results:

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

  1. ముందుగా AP SSC Board వెబ్సైట్ ఓపెన్ చేయండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP SSC supplementary exams 2025 results ”
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. అటనే స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి వాటిని డౌన్లోడ్ చేసుకోండి.

AP SSC/10th Board Website: Results Link

FAQ’s:

1. ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 2025 రిజల్ట్స్ ని ఎప్పుడు విడుదల చేయనున్నారు?

జూన్ మూడో వారంలో అంటే జూన్ 14వ తేదీ నుండి 17వ తేదీ మధ్యన విడుదల చేసే అవకాశం ఉంది.

2. ఫలితాలను చెక్ చేసుకునే వెబ్సైట్ ఏమిటి?

https://www.bse.ap.gov.in వెబ్సైట్లో సప్లిమెంటరీ రిజల్ట్స్ చూసుకోవాలి