AP DSC 2025 Mock Test:
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025 మాక్ టెస్ట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ రోజు నుండి వెబ్సైట్లో మోక్ టెస్ట్ రాసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు. ఏపీ డీఎస్సీ 2025 పరీక్షలకు మొత్తం 5,61,000+ పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఇందులో మూడు లక్షల అరవై వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. రాత పరీక్షలను జూన్ 5వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష అయినందున అభ్యర్థులు ముందుగానే టెస్ట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి మాక్ టెస్ట్ ని వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులు వెబ్సైట్ ఓపెన్ చేసి మాక్ టెస్ట్ 2025 ఆప్షన్స్ క్లిక్ చేసి మీ మొబైల్ లోనే టెస్ట్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా ఈ మోక్ టెస్ట్ అటెండ్ చేయాలనేటువంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
How to attempt AP DSC 2025 mock test:
ఏపీ డీఎస్సీ 2025 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మోక్ టెస్ట్ రాయడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.
- ముందుగా AP DSC 2025 అధికారిక వెబ్సైట్ (Website Link) ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజ్ లో AP Mega DSC 2025 mock test available ఆప్షన్ పై క్లిక్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన సబ్జెక్టుల వారిగా మాక్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి
- మీరు ఏ సబ్జెక్టుకి సంబంధించిన మోక్ టెస్ట్ రాయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి
- వెంటనే టెస్ట్ ఓపెన్ అవుతుంది మీ మొబైల్ లోని మోక్ టెస్ట్ attempt చేయండి
AP DSC 2025 హాల్ టికెట్స్ విడుదల ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ ని మే 30వ తేదీన విడుదల చేయనున్నారు. అభ్యర్థులు వారి యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ లోనే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.
FAQ’s:
1. ఆంధ్రప్రదేశ్ మెగాడిఎస్సి 2025 హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి?
https://apdsc.apcfss.in వెబ్సైట్లో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు
2. ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 రాత పరీక్షలు ఎప్పటినుండి ఎప్పటి వరకు?
జూన్ 5వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు షిఫ్ట్ ల వారీగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించనున్నారు.
