AP EAMCET 2025:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కి సంబంధించి మే నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఎంసెట్ 2025 కి 3,62,392 విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ కు 2,80,578 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి 81,814 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రెండు ఎంట్రన్స్ పరీక్షలకు 914 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. మే 19 నుండి 20వ తేదీ వరకు అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మే 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో 143, హైదరాబాద్ నగరంలో రెండు పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులు, అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని హాల్ టికెట్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని విద్యార్థులు ఫాలో అయ్యి పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. ఎంట్రన్స్ రాత పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం కుదరదని అధికారులు తేల్చి చెప్పారు.
ఏపీ ఎంసెట్ 2025 పరీక్షకు ఎంత మంది అప్లై చేశారు?:
ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ ఎంట్రెన్స్ రాత పరీక్షలకి మొత్తం 3,62,392 విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తెలిపింది. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించనున్నారు.
హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి :
ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు 2025 హాల్ టికెట్స్ ఇంకా డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులు ఈ క్రింది విధంగా వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా అధికారిక వెబ్సైట్ (AP EAMCET Website) ఓపెన్ చేయండి.
- హోం పేజీలో డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క రోల్ నెంబర్ హాల్ టికెట్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పే క్లిక్ చేయండి
- వెంటనే హాల్ టికెట్స్ దీనిపైన డౌన్లోడ్ అవుతుంది అది ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఈ నిబంధనలు పాటించాలి?:
ఏపీ ఎంసెట్ 2025 ఎంట్రన్స్ రాత పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లో తెలిపినటువంటి నిబంధనలను పాటించాలని, నిబంధనలకి అనుగుణంగా ప్రవర్తించని విద్యార్థులను పరీక్ష రాయకుండా డిబార్ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రం లోనికి అనుమతించమని అధికారులు తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే పరీక్ష హాల్లోనికి తీసుకొని రావాలని, ఇతర వస్తువులు మొబైల్ ఫోన్లు గాని, డిజిటల్ గాడ్జెట్స్ గాని, క్యాలిక్యులేటర్, వాచెస్ లాంటివి పరీక్ష హాల్లోనికి అనుమతించరని తెలిపారు.
FAQ’s:
1. ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్ ని నేను ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదు. ఎలా డౌన్లోడ్ చేయాలి?
అధికారికి ఏపీ ఎంసెట్ వెబ్సైట్ (Website Link) నుండి డౌన్లోడ్ చేసుకోండి
2. ఏపీ ఎంసెట్ 2017 పరీక్ష తేదీలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు?
మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు.
