AP Civil Supplies Dept. Notification 2025:
ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ వారు ఏపీలోని 7 జిల్లాలోని రెవిన్యూ డివిజన్ కార్యాలయాల నుండి 450+ రేషన్ డీలర్స్ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్స్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి నెలలోనే జిల్లాలవారీగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులు స్థానిక గ్రామంలో లేదా ఏరియాలో రేషన్ డీలర్స్ గా నియమించి చౌక ధరల దుకాణాలను నడిపించే విధంగా అవకాశం కల్పిస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఏపీలోని రెవిన్యూ డివిజన్ కార్యాలయాల నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
ఆఫ్ లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 2nd జనవరి 2025
ఆఫ్ లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 10th జనవరి 2025, 8th జనవరి 2025 (కొన్ని జిల్లాలకు)
రాత పరీక్ష తేదిలు : 17th జనవరి 2025/ 21st జనవరి 2025
పోస్టుల వివరాలు, అర్హతలు:
ఏపీలోని సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ వారు మండల రెవెన్యూ డివిజన్ కార్యాలయాల నుండి 459+ పోస్టులతో నోటిఫికేషన్ 7 జిల్లాలవారీగా నోటిఫికేషన్స్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 7th/10th పాస్ అర్హత: No Exam
ఎంత వయస్సు కలిగి ఉండాలి:
రేషన్ డీలర్స్ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులకు కనీసం 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు ఎటువంటి వయో పరిమితిలో సడలింపు లేదు.
ఎంపిక విధానం:
దరఖాస్తులు పెట్టుకున్న మహిళలు, పురుష అభ్యర్థులకు జనవరి 17, 21, ఇతర తేదీలలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత సాధించినవారికి ఉద్యోగాలు ఇస్తారు. ఇంగ్లీష్, సివిల్ సప్లయ్స్ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఎటువంటి నెగటివ్ మార్క్స్ లేవు.
సౌత్ సెంట్రల్ రైల్వేలో 10th అర్హతతో ఉద్యోగాలు : Govt జాబ్స్
శాలరీ ఎంత ఉంటుంది:
రేషన్ డీలర్స్ గా ఎంపిక అయినవారికి ఎటువంటి శాలరీస్ ప్రభుత్వం చెల్లించదు, కానీ వారికి నెలకు రేషన్ సరుకులు, బియ్యం ప్రజలకు సరఫరా చేస్తున్నందుకుగానూ ₹10,000/- నుండి ₹25,000/- కమిషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : 10th అర్హత
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తుదారుడు జతచేయవలసిన సర్టిఫికెట్స్ వివరాలు
- వయస్సు ధ్రువీకరణ పత్రం
- విద్యార్హతల ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్
- వికలాంగుల ధ్రువీకరణ పత్రం
- ఓటర్ id / రేషన్ రైస్ కార్డు
- దరఖాస్తుదారుని ఫోటో
- కుల ధ్రువీకరణ పత్రం
- నివాస స్థల ధ్రువీకరణ పత్రం
- నిరుద్యోగిగా ఉన్నట్లు స్వంత దువకరణ పత్రం
ఎలా Apply చెయ్యాలి:
ఈ క్రింది నోటిఫికేషన్స్, అప్లికేషన్ ఫారంలను డౌన్లోడ్ చేసుకొని, అప్లికేషన్ పూరించి అభ్యర్థుల దగ్గరలోని మండల రెవెన్యూ ఆఫీస్ నందు సబ్మిట్ చెయ్యాలి.
రేషన్ డీలర్స్ ఉద్యోగాలకు స్థానికంగా ఉన్న అభ్యర్థులు మాత్రమే ఆ పోస్టులకు Apply చేసుకోవాలి.
