Postal Dept. Notification 2025:
తపాలా శాఖ నుండి అర్హత కలిగిన ఇండియన్ సిటిజన్స్ నుండి గ్రూప్ C నాన్ గేజెట్టెడ్, నాన్ మినిస్టీరియల్ విభాగంలో 17 స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కొరకు ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. 10th అర్హతతో పాటు కార్ డ్రైవింగ్ స్కిల్స్ కలిగి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు ఈ ఉద్యోగానికి అర్హులు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టల్ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు :
పోస్టల్ డిపార్ట్మెంట్ గ్రూప్ C ఉద్యోగాలజు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనవరి 12th, 2025 తేదీలోగా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ని ఎన్వెలప్ లో పంపించవలసిన అడ్రస్ ” ఆఫీస్ ఆఫ్ ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, బీహార్ సర్కిల్, పాట్నా – 80001″ అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ లేదా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవలెను.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
బీహార్ పోస్టల్ ఆఫీస్ నుండి కొత్తగా గ్రూప్ C ఉద్యోగాల భర్తీ కోసం 17 స్టాఫ్ కార్ డ్రైవర్ ఖాళీలను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు 10th అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
Appsc అటవీ శాఖలో 791 FBO, FSO, ABO Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
పోస్టల్ ఉద్యోగాలకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు, SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
పోస్టల్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలకు రాత పరీక్ష లేకుండా, ట్రేడ్ టెస్ట్ లేదా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి, అర్హత కలిగినవారిని ఎంపిక చేసి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ లో సర్టిఫికెట్స్ చెక్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
రోడ్డు రవాణా శాఖలో 10th అర్హతతో 411 Govt జాబ్స్
శాలరీ వివరాలు:
తపాలా శాఖ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- జీతంతో పాటు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు ఎంత?
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద ₹100/- చెల్లించాలి అలాగే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ₹100/- చెల్లించాలి. అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు మరో ₹400/- ఎక్సమినేషన్ ఫీజు చెల్లించాలి. SC, ST, WOMEN అభ్యర్థులకు ఫీజు లేదు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం ఉండాలి.
10th క్లాస్ మార్క్స్ లిస్ట్
కుల ధ్రువీకరణ పత్రాలు
డ్రైవింగ్ లైసెన్స్ (LMV, HMV).
Appsc జాబ్స్ క్యాలెండర్ విడుదల : 2,686 పోస్టులు
ఎలా Apply చెయ్యాలి:
తపాలా శాఖ ఉద్యోగాలకు apply చేయడానికి ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు
Notification & Application Form
పోస్టల్ గ్రూప్ C ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
