APPSC అటవీ శాఖ 791 ఉద్యోగాలు | Appsc Forest Dept. FBO, FSO, ABO Notification 2025 | Freejobsintelugu

Appsc Forest Dept Notification 2025:

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 791 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఖాళీల వివరాలను Appsc అధికారిక జాబ్ క్యాలెండర్ లో ఇవ్వడం జరిగింది. రానున్న జూలై నెలలో నోటిఫికేషన్స్ విడుదల చేసి రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేస్తారు. ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వివరాలు తెలుసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు, వయస్సు వివరాలు:

Appsc ద్వారా భర్తీ చేసే అటవీ శాఖ ఉద్యోగాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Join Whats App Group

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ : 256 పోస్టులు : ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు FBO ఉద్యోగాలకు అర్హులు.

అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ : 435 పోస్టులు : ABO ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఇంటర్మీడియట్ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ : 100 పోస్టులు : FSO ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు Apply చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

పైన తెలిపిన వయస్సులో SC, ST, OBC, EWS అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

రోడ్డు రవాణా శాఖలో 411 Govt జాబ్స్ : 10th పాస్

సెలక్షన్ ప్రాసెస్ :

Appsc అటవీ శాఖ FBO, ABO, FSO ఉద్యోగాలకు మొదటగా రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అందులో ఉత్తేర్నూలు అయిన అభ్యర్థులకు ముఖ్యంగా FBO, ABO ఉద్యోగాలకు ఫిసికల్ ఈవెంట్స్ కూడా నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

Appsc జాబ్స్ క్యాలెండర్ విడుదల : 2,686 పోస్టులు

శాలరీ ఎంత ఉంటుంది:

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. శాలరీతో పాటు TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.

నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు:

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ appsc జనవరి 2nd, 2025 న అధికారిక జాబ్ క్యాలెండరు విడుదల చేయడం జరిగింది. అందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని FBO , ABO, FSO ఉద్యోగాలను భర్తీ చేయడానికి జూలై నెల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని క్యాలెండర్ లో డేట్స్ ఇవ్వడం జరిగింది.

అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply

Appsc క్యాలెండర్ లో మొత్తం 2,686 పోస్టులు ఉంటే అందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలె 791 పోస్టులు ఉన్నాయి. త్వరలో ఈ నోటిఫికేషన్స్ అన్ని విడుదల చేయడానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు.

Join Whats App Group

APPSC Forest Dept Jobs List : PDF

FBO, ABO Jobs Syllabus

Appsc జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు అర్హులే.