TS POLYCET 2025 1st Phase Seat Allotment Results OUT Shortly: Check Results @tgpolycet.nic.in/

TS POLYCET 2025 1st Seat Allotment Results:

తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాల కోసం విద్యార్థులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. జూలై 4వ తేదీన విడుదల కావలసిన ఫలితాలు ఎంతవరకు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఈ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపైన కూడా అధికారుల నుండి ఎటువంటి స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాలి లేదా ఫలితాలు కోసం ఇంకా ఎదురు చూడాలా అని దానిపై సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఫలితాలను అతి త్వరలో ఈరోజు గాని రేపు గాని విడుదల చేసి సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. తలెత్తినటువంటి సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి, వెంటనే ఫలితాలను విడుదల చేయడానికి అన్ని విధాలుగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

ఫలితాలు ఈరోజు విడుదల చేయనున్నారా?:

తెలంగాణ పాలిసెట్ 2025 ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఈరోజు లేదా రేపు సాయంత్రం లోగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సిలింగ్ కోసం దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు మొదటి విడత సీట్ అలాట్మెంట్లో సీట్లు పొందినటువంటి విద్యార్థుల యొక్క వివరాలను, అధికారిక వెబ్సైట్లో పొందుపరిచి లింక్ ఆక్టివేట్ చేయనున్నారు.

Join WhatsApp group

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలను ఈ కింది స్టెప్ బై స్టెప్ విధానం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

ఈరోజు తెలంగాణలో కొన్ని పాఠశాలలకు సెలవు : అధికారిక సమాచారం చూడండి

  1. ముందుగా తెలంగాణ పాలిసెట్ 2025 అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి.
  2. వెబ్సైట్ హోం పేజ్ లో “TG polycet 2025 First phase seat allotment order ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క లాగిన్ డీటెయిల్స్ తో, వెబ్ సైట్ లోనికి లాగిన్ అయ్యి
  4. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ పై క్లిక్ చేసినట్లయితే మీయొక్క ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి
  5. ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చింది అనేదానిపై పూర్తి వివరాలు మెన్షన్ చేసి ఉంటుంది.
  6. మీకు సీటు వచ్చిన కాలేజీకి వెళ్లి మీరు ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాలి.

TS POLYCET 2025 Results

FAQ’s:

1. తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి దశ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ విడుదలకు ఎందుకు ఆలస్యం అవుతుంది?

కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ ఆలస్యం అయ్యిందని అధికారులు చెప్తున్నారు

2. ఫలితాలను ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి?

https://tgpolycet.nic.in/ వెబ్సైట్లో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.