ఈరోజు స్కూళ్లకు సెలవు : మెసేజెస్ పంపిస్తున్న కొన్ని స్కూళ్ల యాజమాన్యం – పూర్తి వివరాలు చూడండి

TS Schools Holiday Today:

మొహరం పండుగ సందర్భంగా తెలంగాణలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు ఈరోజు సెలవు అని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కి సంబంధించిన యాజమాన్యం స్కూల్ పిల్లల పేరెంట్స్ కి మెసేజెస్ పంపిస్తున్నాయి. ఆ మెసేజ్ లో ‘ మొహరం పండుగ సందర్భంగా’ స్కూల్ హాలిడే అని మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకారం మొహరం హాలిడే జూలై 6 ఆదివారం రోజు వచ్చింది, కానీ ఈరోజు జూలై 7 సోమవారం, అయినా కూడా తెలంగాణలోని కొన్ని ప్రైవేటు స్కూల్స్ ఈరోజు సెలవు దినం అని మెసేజెస్ పంపించడం గమనార్హం.

కొన్ని స్కూల్స్ కి సెలవు లేదనే దానిపై క్లారిటీ:

తల్లిదండ్రులకు సందేశాలు (Messages) పంపుతూ కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు స్పష్టంగా ” ఈరోజు క్లాసులు యధావిదంగా జరుగుతాయి ” అని తెలియజేస్తూతల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు మెసేజెస్ పంపిస్తున్నాయి. అంటే తెలంగాణలోని కొన్ని స్కూళ్లకు సెలవు లేదు. మరికొన్ని స్కూళ్లు మాత్రం సెలవు ప్రకటించాయి. సంబంధిత స్కూల్ పాలసీ పై ఆధారపడి ఉంటుంది.

Join WhatsApp group

మీకు మొహరం పండుగ సందర్భంగా సెలవు అని మెసేజ్ ఏమైనా వచ్చిందా?:

మీ పిల్లలు చదువుతున్న స్కూల్ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఈరోజు సెలవు ఉందా లేదా అనే దానిపై క్లారిటీ తెచ్చుకోండి. డైరెక్ట్ గా స్కూల్ అప్డేట్ లేదా స్కూల్ యాప్ లేదా స్కూల్ కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన సందేశాల ఆధారంగా నిర్ధారించుకోండి.

AP IIIT 2025 2nd phase cut off marks

తల్లిదండ్రులకు, విద్యార్థులకు ముఖ్య గమనిక:

  • ఈరోజు స్కూలు ఉందా లేదా తెలుసుకునే విషయంలో, విద్యార్థి యొక్క స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ను వెంటనే సంప్రదించండి. సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్ లు మాత్రం నమ్మవద్దు.
  • ముందుగా సెలవు దినానికి సంబంధించి నిర్ధారణ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సెలవు ఉందా? లేదా?:

ఆంధ్రప్రదేశ్లోని ఏ పాఠశాలకు కూడా ఈరోజు సెలవుదినంగా ప్రకటించబడలేదు. స్కూల్ కి వెళ్లే సంబంధిత తల్లిదండ్రుల మొబైల్ ఫోన్ లకు ఈరోజు సెలవు దినం అనిసందేశాలు రాలేదు. కావున ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు మరియు కళాశాలలకు పని దినం. ఎటువంటి హాలిడే లేదు.