NEET UG 2025: 250 నుండి 400 మధ్య మార్కులు వచ్చినవారికి ఏ కాలేజీలో మెడికల్ సీటు వస్తుంది?. Category Wise Seats వివరాలు చూడండి

NEET UG 2025:

NEET UG 2025 ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చిన తర్వాత చాలామందికి 250 నుండి 400 మంది మార్కులు వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే ఈ మార్కులు వచ్చిన వారికి MBBS లేదా BDS సీటు అయినా వస్తుందా లేదా అనేటువంటి సందేహంలో ఉన్నారు. ఈ రేంజ్ మార్కులతో ఎలాంటి ప్రభుత్వ లేదా ప్రైవేటు కళాశాలల్లో అవకాశం ఉంటుంది. ఈ వివరాలు కేటగిరీల వారీగా, రాష్ట్రాల వారీగా, all India quota వివరాలను గత సంవత్సరంలో వచ్చిన మార్కులకు ఏ కాలేజీలలో సీటు వచ్చిందో ఆ డేటా ప్రకారం ఈ వివరాలు అందిస్తున్నాము. కాబట్టి ఈ ఆర్టికల్ లోని పూర్తి సమాచారం చూడండి.

ఆంధ్రప్రదేశ్లో 250 నుండి 400 మార్కులతో సీటు వస్తుందా?:

Join WhatsApp group

NEET UG 2025 కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే తేదీ

జనరల్ కేటగిరీ:

  • MBBS గవర్నమెంట్ సీట్ :400+ మార్క్స్ అవసరం ( 400 మార్కుల కంటే తక్కువ వచ్చిన వారికి ఛాన్సెస్ చాలా తక్కువ )
  • గవర్నమెంట్ BDS సీట్: 350+ మార్క్స్ వచ్చిన వారికి అవకాశం ఉంటుంది.
  • ప్రైవేట్ MBBS (కేటగిరీ B): 270 – 400 మధ్య మార్కులు వచ్చిన వారికి సీటు వస్తుంది.
  • ప్రైవేట్ BDS : 250+ మార్క్స్ వచ్చినవారికి సీటు వస్తుంది.

BC (A/B/C/D/E) కేటగిరీలు:

  • MBBS గవర్నమెంట్ సీట్: 360-400 మధ్య మార్క్స్ వచ్చిన వారికి అవకాశం ఉంటుంది.
  • BDS గవర్నమెంట్ సీట్: 310+ మార్క్స్ తో అవకాశం ఉంటుంది.
  • ప్రైవేట్ MBBS (B కేటగిరీ ): 260+ మాక్స్ వచ్చిన చాలు సీట్ పక్కాగా వస్తుంది.

TS TET 2025 జూన్ పరీక్షల ఫలితాలు విడుదల తేదీ?

SC/ST కేటగిరీ:

  • గవర్నమెంట్ MBBS సీట్ : SC కి 310+ మార్క్స్ తో, ST కి 280+ మార్క్స్ తో సీటు వచ్చే అవకాశం ఉంటుంది.
  • గవర్నమెంట్ BDS సీట్ : SC కి 270+ మార్క్స్, ST కి 250+ మార్క్స్ తో సీటు వచ్చే అవకాశం ఉంటుంది.
  • ప్రైవేట్ MBBS : 250+ మార్క్స్ తో కచ్చితంగా సీటు వస్తుంది.

తెలంగాణలో 250-400 మార్కులకు సీట్ వస్తుందా?:

జనరల్ కేటగిరీ:

  • గవర్నమెంట్ MBBS సీట్ : 400+ మార్క్స్ వచ్చిన వారికి మాత్రమే సీటు వస్తుంది.
  • గవర్నమెంట్ BDS సీట్ : 360+ మార్కులతో సీటు వస్తుంది.
  • ప్రైవేట్ MBBS (B కేటగిరీ) : 280 నుండి 4 మధ్య మార్పులు వచ్చిన వారికి సీట్ కన్ఫర్మ్ అవుతుంది.

IIIT బాసరలో సీట్ రావాలంటే 10th లో 600 కి ఎన్ని మార్కులు రావాలి

OBC కేటగిరీల వారికి :

  • గవర్నమెంట్ MBBS సీట్ : 370+ మార్క్స్ వచ్చిన వారికి సీటు కన్ఫర్మ్ గా వస్తుంది.
  • గవర్నమెంట్ BDS సీట్ : 330+ మార్క్స్ వచ్చిన వారికి సీటు వస్తుంది
  • ప్రైవేట్ MBBS : 260+ మార్క్స్ తో సీటు వస్తుంది

SC/ST కేటగిరి వారికి :

  • గవర్నమెంట్ MBBS సీట్ : SC – 290 – 310 తో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ST – 260 నుండి 290 మధ్య మార్పులు వచ్చిన వారికి అవకాశం ఉంటుంది.
  • గవర్నమెంట్ BDS సీట్ : 250-270 మధ్య మార్క్స్ వచ్చిన వారికి అవకాశం ఉంటుంది.
  • ప్రైవేట్ MBBS : 250+ మార్క్స్ తో కచ్చితంగా సీటు వస్తుంది.

Top private medical colleges in AP & TS (For 250- 400 marks ):

College nameStateApprox. Fee (Category B)Eligibility
నారాయణ మెడికల్ కాలేజ్AP₹12Lakhs/Year280+ Marks
Apollo ఇన్స్టిట్యూట్ హైదరాబాద్TS₹14Lakhs /Year300+ Marks
PES ఇన్స్టిట్యూట్ కుప్పంAP₹11Lakhs/Year270+ Marks
MNR మెడికల్ కాలేజ్TS₹13Lakhs/Year260+ Marks
ఫాతిమా ఇన్స్టిట్యూట్ కడపAP₹10Lakhs/Year250+ Marks

• Note: కేటగిరీ B అంటే NEET క్వాలిఫై అయిన వారికి ర్యాంక్ ఆధారంగా ఎంట్రీ ఇచ్చే ప్రైవేట్ కోటా

250-400 మాక్స్ మధ్య వచ్చిన వారికి NEET కౌన్సిలింగ్ స్ట్రాటజీ:

  1. గవర్నమెంట్ సీట్ రావాలని చూస్తే – సొంత క్యాటగిరి తో పాటు లోకల్ ఏరియా కోటాలను ఉపయోగించండి.
  2. ప్రైవేట్ MBBS కోసం కేటగిరీ B కౌన్సిలింగ్ కి అప్లై చేయండి
  3. BDS/ఆయుష్ కోర్సెస్ కి కూడా ఎలిజిబుల్ ఉంటుంది
  4. ఆప్షన్స్ ఎంట్రీ సమయంలో ఎక్కువ సంఖ్యలో కాలేజెస్ ఆప్షన్స్ పెట్టుకోండి.

NEET UG 2025 లో 250-400 మధ్య మార్క్స్ వచ్చిన వారికి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కళాశాలలో సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా SC/ST, BC క్యాటగిరి అభ్యర్థులకు స్టేట్ కోటా ఆధారంగా మంచి కళాశాలలోనే సీటు వచ్చే అవకాశం ఉంటుంది.