Annadhatha Sukhibhava Scheme 2025:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోఫా సిక్స్ పథకాల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ పథకం ద్వారా మొత్తం 47.77 లక్షల రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామ వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా ఇప్పటివరకు 98 శాతం మంది ఈ కేవైసీ పూర్తి చేసినట్లు, ఇంకా 61 వేల మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ కార్యదర్శి ఢిల్లీ రావు శుక్రవారం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకాన్ని జూలై నెలలో అమలు చేయనున్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ గురించి ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
పథకం ముఖ్యమైన అంశాలు :
- 98% రైతులకు ఆధార్ మరియు భూమి వివరాలు యొక్క లింక్ పూర్తయింది
- మొత్తం 61 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.
- మొదటి విడతగా 47.77 లక్షల మంది రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తించారు.
- ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించనున్న ప్రభుత్వం
ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి?:
- రైతు సోదరులకు పంట సాగు కోసం ముందస్తుగానే ఆర్థిక సహాయం అందిస్తారు
- వ్యవసాయ ఇన్పుట్స్ కొనుగోలు కోసం సహాయపడడం
- భీమా, సాగు పరికరాలు, రైతు బజార్లు మొదలైన వ్యవసాయ అంశాలకు ప్రోత్సాహకం
- పంట సాగుకు కావలసిన అన్ని సహాయ సహకారాలు అందించడం.
ఏపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల మంజూరు కొరకు దరఖాస్తుల ఆహ్వానం: Apply
పథకం అమలు చేసే టైంలైన్ ఇదే:
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో సంవత్సరానికి 20వేల రూపాయలు జమ చేయనున్నారు. అయితే ఈ డబ్బులను మూడు విడతల్లో జమ చేయనున్నట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడు విడతలకి సంబంధించిన టైం లైన్ ఈ క్రింది విధంగా ఉంది.
ఏపీ నిరుద్యోగ భృతి ప్రారంభ తేదీ వచ్చేసింది : ఎలా అప్లై చేయాలి
- 2025 జూలై : రాబోయే జూలై నెలలో మొదటి విడత కింద ₹7,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు
- 2025 అక్టోబర్ : అక్టోబర్ నెలలో రెండో విడత డబ్బులను జమ చేస్తారు.
- 2026 జనవరి: మూడో విడత డబ్బులను మిగిలినటువంటి రైతులందరికీ ఖాతాల్లో జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి డబ్బులు జమ పూర్తి చేస్తారు.
భూమిలేని కౌలుదారులకు శుభవార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమిలేని కౌలుదారులకు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. భూమిలేని ఓసి, బీసీ,ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులకు డబ్బు జమ్ము కావాలి అంటే కౌలు గుర్తింపు కార్డు పొందాలని, ఇ-పంటలో నమోదు కావాలని సూచించారు.
ఏపీ తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితా విడుదల: Check Here
లబ్ధిదారుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి?:
- అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు అర్హులా కాదా అనే లబ్ధిదారుల జాబితాని మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాన్ని సంపాదించి లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
- అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే, మూడు విడతల్లో మీ అకౌంట్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది.
అధికారిక ప్రకటనలో వ్యవసాయ కార్యదర్శి ఏమన్నారు?:
వేరే రాష్ట్రాల నుండి వచ్చిన రైతుల యొక్క వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉందని, వీలైనంత త్వరగా అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయం బలపడాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మీడియాకు తెలిపారు.
ముఖ్యమైన గమనిక:
ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, స్టేటస్ చెక్, లబ్ధిదారుల జాబితా వంటి వివరాలు త్వరలో అధికారికి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
