TS EAMCET 2025 Counselling:
తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే TS EAMCET 2025 counselling మళ్లీ వాయిదా పడినట్లు అధికారిక సమాచారం వచ్చింది. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించే వర్సిటీ వారు ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని తాజా ప్రభుత్వ సమాచారం ద్వారా స్పష్టమవుతోంది. జూన్ 25 లేదా 26 తేదీల్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేయాలని గతంలో భావించినప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలవల్ల ఈ షెడ్యూల్ ని వాయిదా వేశారు. అయితే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ జూలై మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఎంసెట్ కౌన్సిలింగ్ కు బ్రేక్ పడడానికి ముఖ్యమైనటువంటి కారణాలేమిటపుడు చూద్దాం.
కౌన్సిలింగ్ కి బ్రేక్ పడడానికి గల అధికారిక ముఖ్య కారణాలు:
- వైద్య మరియు వ్యవసాయ విభాగాల కౌన్సిలింగ్ ప్రాసెస్ పూర్తి కాకపోవడం వల్ల ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుంది
- ప్రభుత్వ సాంకేతిక విద్యాశాఖ మరియు ఉన్నత విద్యాశాఖ మధ్య సమన్వయ లోపం
- ప్రైవేట్ కళాశాలలో ఎవరికి తోచినట్లు వారు అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి
- ఈ కారణాల వల్ల కౌన్సిలింగ్ ప్రక్రియకు బ్రేక్ పడుతోంది
కౌన్సిలింగ్ ఎప్పటి నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది?:
- తెలంగాణ ఉన్నత విద్యా మండలి వర్గాల సమాచారం ప్రకారం
- జూలై మొదటి వారంలో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి ధృవీకరణ ప్రక్రియ ప్రారంభిస్తారు
- జూలై రెండవ వారంలో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు
- జూలై మూడో వారంలో సీట్ అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలని అటువంటి లక్ష్యంతో కొత్త కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారు అవుతుంది.
AP EAMCET 2025 2nd Round ఫలితాలు విడుదల చేశారు.

ముఖ్యమైన అంశాలు?:
- జూన్ 25 లేదా 26వ తేదీన విడుదలవలసిన కౌన్సెలింగ్ నోటిఫికేషన్ కి మళ్ళీ బ్రేకులు పడ్డాయి. దీనికి ఉన్నత విద్యా మండలికి అలాగే సాంకేతిక ఆ విద్య శాఖకు మధ్య సమన్వయ లోపం వల్ల ఈ విధంగా సమస్య తలెత్తుతుంది
- ఎంసెట్ ఇంజినీరింగ్ కళాశాల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ పై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు
- ప్రైవేట్ కళాశాలలో ఇప్పటికే కౌన్సిలింగ్ ని ప్రారంభించడంతో, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల పై ఒత్తిడి పెరుగుతుంది
- టెక్స్ట్ బుక్స్ మరియు ఫీజు వివరాల సమాచారాన్ని ముందే విడుదల చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
TS LAWCET, PGLCET 2025 రిజల్ట్స్ విడుదల
విద్యార్థులకు సూచనలు:
- ఫేక్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ని విద్యార్థులు నమ్మవద్దు. అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఉన్నత విద్యా మండలి తెలుపుతోంది.
- కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలవడానికి ముందే, విద్యార్థులకు కావాల్సిన సర్టిఫికెట్లని సమకూర్చుకుని రెడీగా ఉంచుకోవాలి.
- వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో ఉండవలసినటువంటి కాలేజీలో జాబితా వివరాలను ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకోండి.
తెలంగాణ ఎంసెట్ అధికారిక కౌన్సిలింగ్ షెడ్యూల్ కి సంబంధించిన సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.
