CBSE 10th Board Exams 2026 Update:
CBSE ( సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ) 10వ తరగతి పరీక్షల నిర్వహణలో కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుండి సంవత్సరానికి రెండుసార్లు పదో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించినట్లు అధికారికంగా ప్రకటించింది.ఈ నిర్ణయం విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు, మంచి అవకాశాలు కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం అని సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది.
రెండు ఫేజులుగా పరీక్షలు ఎలా నిర్వహిస్తారు?:
- మొదటి ఫేజ్ పరీక్ష : ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహిస్తారు.
- రెండవ ఫేజ్ పరీక్ష: ప్రతి సంవత్సరం మే నెలలో నిర్వహిస్తారు.
- విద్యార్థులు ఈ రెండు ఫేజ్ పరీక్షల్లో పాల్గొనవచ్చు. కానీ బెస్ట్ స్కోర్ మాత్రమే తుది ఫలితంగా పరిగణలోనికి తీసుకుంటారు.
ఈ మార్పులు వెనుక ఉన్న ముఖ్యమైన కారణం?:
ఈ విధానాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్రకారం తీసుకువచ్చారు. ఒకే పరీక్షలో విద్యార్థులు తప్పుగా రాసి ఫెయిల్ అయినట్లయితే వారి జీవితంపైన ప్రభావం పడకుండా ఉండడానికి, విద్యార్థులకు రెండో అవకాశం ఇవ్వడమే ప్రధాన ఉద్దేశం. ఇలాంటి విధానమే జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో కూడా ఉంటుంది. Jee మెయిన్స్ పరీక్షలాగానే ఎవరైనా రెండుసార్లు పరీక్ష రాసి మంచి స్కోర్ పొందవచ్చు.
TS EAMCET 2025 కౌన్సిలింగ్ మళ్లీ వాయిదా వేశారు
ఈ రెండు ఫేజ్ ల ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?:
- మొదటి ఫేజ్ కింద ఫిబ్రవరిలో జరిగే పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ మాసంలో విడుదల చేస్తారు
- రెండవ ఫేజ్ కింద మే నెలలో నిర్వహించే ఫలితాలను జూన్ నెలలో విడుదల చేయడం జరుగుతుంది.
- అయితే (Internal Assessment) ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది.
- ప్రత్యేకంగా వింటర్ స్కూళ్లకు ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఇవ్వనన్నట్లు సీబీఎస్ఈ బోర్డు తెలిపింది.
TS 10th సప్లిమెంటరీ పరీక్ష తేదీలు విడుదల తేదీ
ఈ విధానం వల్ల విద్యార్థులకు కలిగే ఉపయోగం ఏమిటి?:
- ఈ విధానం వల్ల విద్యార్థులు తప్పులు చేయకుండా మళ్ళీ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది
- ఇలా రెండుసార్లు పరీక్షలు రాయడం వల్ల ఉత్తమ మార్కులు పొందే అవకాశం
- పిల్లలపై ఒత్తిడి భారం బాగా తగ్గుతుంది.
- తల్లిదండ్రులకు, టీచర్లకు కూడా అభ్యాసంలో సౌలభ్యం ఉంటుంది.
CBSE బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం 2026 నుండి అమలులోకి రానుంది. కాబట్టి 8వ తరగతిలో ఉన్న విద్యార్థులు ఈ కొత్త విధానాన్ని అనుసరించునున్నారు. ఇది విద్యార్థుల భవిష్యత్ కు ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
