AP తల్లికి వందనం పధకం రెండో విడత డబ్బులు జమ: అర్హుల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైనటువంటి తల్లికి వందనం పథకాన్ని ఇటీవల ప్రారంభించిన విషయం మీకు తెలిసిందే. అయితే అందులో కొంతమంది తల్లుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ కాలేదు. డబ్బులు డిపాజిట్ కానీ పల్లబ్ధిదారులు జూన్ 20వ తేదీ వరకు వారి యొక్క అభ్యంతరాలను సబ్మిట్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు అభ్యంతరాలు పెట్టుకున్న లబ్ధిదారుల యొక్క సర్టిఫికెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ జూన్ 28వ తేదీ వరకు జరుగుతుంది. జూన్ 30వ తేదీన రెండో విడత అర్హుల జాబితా ని విడుదల చేస్తారు. రెండో విడత జాబితాలో ఉన్న లబ్ధిదారుల ఎకౌంట్లో జూలై 5వ తేదీన డబ్బులు డిపాజిట్ చేయడం జరుగుతుందని గతంలోనే ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు రెండో జాబితా కి సంబంధించిన ముఖ్యమైనటువంటి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

తల్లికి వందనం పథకం రెండవ జాబితా (Phase 2) అధికారిక షెడ్యూల్:

Join What’s App Group

  • తల్లికి వందనం పథకం ప్రారంభించిన తేదీ మరియు eligible in eligible జాబితా ప్రదర్శన చేసిన తేదీ: జూన్ 12, 2025
  • గ్రీవెన్స్ ( అభ్యంతరాల స్వీకరణ ) తేదీలు : జూన్ 12 నుండి 20 మధ్యన స్వీకరించారు
  • గ్రీవెన్స్ వెరిఫికేషన్ మరియు సప్లిమెంటరీ జాబితా తయారీ తేదీలు : జూన్ 21 నుండి 28 మధ్య
  • ఫైనల్ జాబితా విడుదల తేదీ ( ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు ): జూన్ 30, 2025
  • ఫైనల్ జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు డబ్బులు డిపాజిట్ అయ్యే తేదీ : జూలై 5, 2025

ఎంత నగదు డిపాజిట్ అవుతుంది?:

  1. తల్లికి వందనం పథకానికి అర్హత పొందిన లబ్ధిదారులకు, విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లో ₹15,000/- బదులు ₹13,000/- డిపాజిట్ అవుతుంది
  2. ₹15000/- రూపాయల అమౌంట్ లో ₹2000/- రూపాయలు పాఠశాలల మెయింటెనెన్స్ కోసం కట్ చేస్తారు.
  3. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు, ప్రతి పిల్లవాడికి 13 వేల రూపాయల చొప్పున డిపాజిట్ అవుతాయి

AP అన్నదాత సుఖీభవ పధకం డబ్బులు విడుదల తేదీ

రెండవ జాబితాలో (Phase 2 List) మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి?:

  • రెండో విడత జాబితాలో మీ పేరు ఉందేమో చెక్ చేసుకోవడానికి, మీ దగ్గరలోని గ్రామా సచివాలయానికి వెళ్ళు అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులను సంప్రదించండి.
  • వారు మీ యొక్క పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసి చెప్తారు.
  • రెండవ జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే, మీకు జూలై 5వ తేదీన డబ్బులు డిపాజిట్ అవుతాయి..
  • గ్రామ సచివాలయానికి వారు, ఏపీ ప్రభుత్వ మనమిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా తల్లికి వందనం పథకం జాబితా లిస్ట్ ని చెక్ చేసుకోవచ్చు.
  • మనమిత్ర వాట్సాప్ నంబర్ : +91 95523 00009

ఇకపై 10th బోర్డు పరీక్షలు 2 సార్లు : Official

Summarised Dates List:

అంశముతేదీ
పథకం ప్రారంభ తేదీ12th జూన్, 2025
గ్రీవెన్స్ స్వీకరణ ఆఖరి తేదీ20th జూన్, 2025
గ్రీవెన్స్ పరిశీలనా మరియు సప్లిమెంటరీ జాబితా తేదీ21- 28th జూన్, 2025
ఫైనల్ జాబితా ప్రదర్శన తేదీ30th జూన్, 2025
రెండో విడత డబ్బులు డిపాజిట్ తేదీ5th జూలై, 2025

నీకు ఇంకా ఈ తల్లికి వందనం పథకం డబ్బుల డిపాజిట్ మరియు అర్హుల జాబితా విషయంలో ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే, ఈ క్రింది కామెంట్ సెక్షన్ లో అడగండి. మీ యొక్క సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుంది.