AP EAMCET 2025 Revised Rank Cards:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 20025 ఫలితాలను జూన్ 8వ తేదీన విడుదల చేసినప్పటికీ, మరో 15 వేల మంది విద్యార్థుల యొక్క ఫలితాలను మళ్లీ విడుదల చేయడానికి ఏపీ ఎంసెట్ కన్వీనర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన 10+2 బోర్డు విద్యార్థులు, అలాగే ఏపీ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరం ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు వారి యొక్క ఇంటర్ మార్కుల వివరాలను ఏపీ ఎంసెట్ వెబ్సైట్ డిక్లరేషన్ ఫారం లో అప్లోడ్ చేసే సబ్మిట్ చేయనందున,వారికి జూన్ 15వ తేదీ వరకు సమయం ఇచ్చే వారు ఇంటర్ మార్కులను అప్లోడ్ చేయవలసిందిగా ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 15వ తేదీ వరకు కొత్తగా ఎవరైతే ఇంటర్ మార్కుల వివరాలను డిక్లరేషన్ ఫారం లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేశారో వారి యొక్క కొత్త ర్యాంక్ కార్డులను జూన్ 20 లేదా 21వ తేదీన విడుదల చేయడానికి అధికారులు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ రివైజ్డ్ ఎంసెట్ ర్యాంక్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
కొత్త ర్యాంకులు మళ్లీ ఎందుకు విడుదల చేస్తున్నారు?. అందరికీ ర్యాంకులు మారుతాయా?.
జూన్ 8వ తేదీన ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ అయ్యి ర్యాంక్ వచ్చిన వారికి ఎటువంటి కొత్త ర్యాంక్ విడుదల చేయడం లేదు. ఎవరైతే ఇతర రాష్ట్రాల ఇంటర్ బోర్డులకి చెందిన విద్యార్థులు, అలాగే ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ అయిన విద్యార్థులు ఇటీవల డిక్లరేషన్ ఫారంలో ఇంటర్ మార్కులను అప్లోడ్ చేసి సబ్మిట్ చేశారో, వారికి మాత్రమే రివైజ్డ్ ర్యాంక్స్ ని విడుదల చేసి ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు.
Revised Ranks ఎప్పుడు విడుదల చేస్తారు?:
ఏపీ ఎంసెట్ 2025 రివైజ్డ్ ర్యాంకులను కేవలం 15 వేల మంది విద్యార్థుల కోసం జూన్ 20వ తేదీ లేదా 21న విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకా ఆలస్యమైనట్లయితే జూన్ 23వ తేదీన అనగా సోమవారం రోజు ఫలితాలను విడుదల చేస్తారు. జూన్ 8వ తేదీన ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకులు రాని వారికి మాత్రమే ఈ కొత్త ర్యాంకులను విడుదల చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ లో వచ్చిన 25% మార్కుల వెయిటేజ్ ని కూడా కలిపి, 15 వేల మంది విద్యార్థులకు కొత్త ర్యాంకులను జారీ చేయనున్నారు.
ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్, వెబ్ ఆప్షన్స్, సర్టిఫికెట్స్ పరిశీలన వివరాలు
How To Download New Rank Cards:
కొత్త ర్యాంక్ కార్డులను ఈ క్రింది స్టెప్ డే స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా ఏపీ ఎంసెట్ 2025 అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోమ్ పేజీలో డౌన్లోడ్ రాంక్ ఆప్షన్ క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన విద్యార్థుల యొక్క కొత్త ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది
- అది ప్రింట్ అవుట్ తీసుకొని, ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం దాచి ఉంచండి.
AP EAMCET 2025: Revised Rank Cards
అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితా విడుదల : Check Here
ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు?:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ని జూన్ 25వ తేదీ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి, సర్టిఫికెట్ల పరిశీలన చేసి, వెబ్ ఆప్షన్స్ తీసుకొని,మరియు విద్యార్థులకు సీట్ అల్లౌట్మెంట్ చేసి ఆగస్టు 14వ తేదీ లోపు మొదటి సంవత్సర తరగతులు ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
